కన్నడ నాటకం.. సోమవారానికి అసెంబ్లీ వాయిదా

కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. రెండో రోజైనా బల పరీక్ష జరుగుతుందనుకున్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. సభలో మరోసారి గందరగోళం నెలకొనడంతో.. సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. సభను స్పీకర్ వాయిదా వేయడంతో సభలో నిలబడి బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంత రాత్రి అయినా సరే.. ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ స్పీకర్ ఓటింగ్ నిర్వహించకుంటే రాష్ట్రపతిని కలవాలని […]

కన్నడ నాటకం.. సోమవారానికి అసెంబ్లీ వాయిదా

Edited By:

Updated on: Jul 19, 2019 | 8:57 PM

కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. రెండో రోజైనా బల పరీక్ష జరుగుతుందనుకున్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. సభలో మరోసారి గందరగోళం నెలకొనడంతో.. సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. సభను స్పీకర్ వాయిదా వేయడంతో సభలో నిలబడి బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంత రాత్రి అయినా సరే.. ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ స్పీకర్ ఓటింగ్ నిర్వహించకుంటే రాష్ట్రపతిని కలవాలని బీజేపీ భావిస్తోంది. విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాతే ఓటింగ్ చేపడుతామని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.