Anand Mamani: కర్ణాటక డిప్యూటీ స్పీకర్‌ ఆనంద్‌ కన్నుమూత.. నివాళులర్పించిన సీఎం బసవరాజు బొమ్మై..

కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ మామణి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన శనివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.

Anand Mamani: కర్ణాటక డిప్యూటీ స్పీకర్‌ ఆనంద్‌ కన్నుమూత.. నివాళులర్పించిన సీఎం బసవరాజు బొమ్మై..
Anand Mamani

Updated on: Oct 23, 2022 | 12:28 PM

కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ మామణి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన శనివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. 56 ఏళ్ల ఆనంద్ మామిణి.. మధుమేహంతోపాటు కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో నెలరోజులపైనుంచి చికిత్స పొందుతున్నారు. తొలుత చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు.. అనంతరం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆయన.. పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆనంద్‌ మామణి.. బెలగావి జిల్లాకు చెందిన సవదట్టి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ స్పీకర్‌గా సేవలందిస్తున్నారు.

కాగా.. ఆనంద్‌ మమణి మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. సీఎం బొమ్మై ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. “మా పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనంద చంద్రశేఖర మామణి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.. ఓం శాంతి’’ అంటూ నివాళులు అర్పించారు. ఆసుపత్రిని సందర్శించి ఆనంద్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించారు.

ఆయన భౌతికకాయాన్ని ఆదివారం స్వగ్రామానికి తరలించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల సందర్శన అంనతరం.. అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..