‘శివసేన కాదది, సోనియా సేన’, భగ్గుమన్న కంగనా

మహారాష్ట్రలో శివసేన పార్టీ తన సిధ్ధాంతాలను అమ్ముకుంటోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. లోగడ బాలాసాహెబ్ ఏ ఐడియాలజీతో సేనను ఏర్పాటు చేశారో, ఆ పార్టీ ఇప్పుడు తన సిధ్ధాంతాలను..

శివసేన కాదది, సోనియా సేన, భగ్గుమన్న కంగనా

Edited By:

Updated on: Sep 10, 2020 | 5:05 PM

మహారాష్ట్రలో శివసేన పార్టీ తన సిధ్ధాంతాలను అమ్ముకుంటోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. లోగడ బాలాసాహెబ్ ఏ ఐడియాలజీతో సేనను ఏర్పాటు చేశారో, ఆ పార్టీ ఇప్పుడు తన సిధ్ధాంతాలను అమ్మివేసి ‘శివసేన’ నుంచి ‘సోనియా సేన’ గా మారిపోయిందని ఆమె విమర్శించింది. నిన్నముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేసిన బాంద్రాలోని తన కార్యాలయాన్ని ఆమె గురువారం విజిట్ చేసింది.  కార్పొరేషన్ అధికారులను కంగనా గూండాలుగా అభివర్ణించింది. అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ ఈ ఆఫీసును వారు కూల్చివేయడం గూండాయిజం కాక మరేమిటని ఆమె ప్రశ్నించింది.

ఇలా ఉండగా.. కంగనా ‘ఎపిసోడ్’ ఇక ముగిసినట్టేనని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆ వివాదానికి తాము దూరమని, ప్రభుత్వం చేపడుతున్న అభివృధ్ది కార్యక్రమాలపై దృష్టి నిలుపుతామని ఆయన పేర్కొన్నారు,.