ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. డాక్టర్లు నయం చేయలేని ఎన్నో రోగాలకు దివ్యౌషధం!

|

Aug 18, 2023 | 5:33 PM

అడవుల్లో దొరికే ఈ ఔషధ పండును కఫల్‌ (బేబెర్రీ) అని అంటారు. ఇవి ఉత్తరాఖండ్ అడవుల్లో మాత్రమే దొరికే ఔషధ పండు. కఫల్‌ పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామి వీటిలోని ఔషధ గుణాల గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ పండు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంన్నందుకు సీఎం ధామికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు కూడా తెలిపారంటే కఫల్‌ పండ్ల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. ఇవి పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. రుచికి పుల్లగా, తీపిగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాల..

ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. డాక్టర్లు నయం చేయలేని ఎన్నో రోగాలకు దివ్యౌషధం!
Kafal Fruits
Follow us on

ఈ ఫొటోలో కనిపించే పండ్లను ఎప్పుడైనా చూశారా? డాక్టర్లు నయం చేయలేని ఎన్నో వ్యాధులను ఈ ఔషధ పండ్లు నయం చేస్తాయని మీకు తెలుసా.. అవును! అడవుల్లో దొరికే ఈ ఔషధ పండును కఫల్‌ (బేబెర్రీ) అని అంటారు. ఇవి ఉత్తరాఖండ్ అడవుల్లో మాత్రమే దొరికే ఔషధ పండు. కఫల్‌ పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామి వీటిలోని ఔషధ గుణాల గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ పండు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంన్నందుకు సీఎం ధామికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు కూడా తెలిపారంటే కఫల్‌ పండ్ల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. ఇవి పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. రుచికి పుల్లగా, తీపిగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఈ పండ్లను ఉపయోగిస్తు్న్నారు. కఫల్‌ పండ్లు చెట్టు నుంచి కోసిన తర్వాత రెండు రోజులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత అవి పాడైపోతాయి.

Kafal Fruits

ఈ పండ్లతో తయారు చేసిన జ్యూస్‌ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య దూరం అవుతుంది. కీళ్లలో ఉండే క్రిస్టల్స్ సమస్య కూడా తొలగిపోతుంది. ఈ పండ్లలో విటమిన్ సి, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కఫల్‌ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీర వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనిలో ఉన్నాయి. అంతేకాకుండా కఫల్‌ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది.

Kafal Fruits

ఈ పండ్లను ఎలా తినాలంటే..

కఫల్‌ (బేబెర్రీ) పండ్లను తాజాగా లేదా ఎండబెట్టి తినవచ్చు. జామ్‌లు, జిలేబీలు, చట్నీలు, పచ్చళ్లు, ప్రిజర్వ్‌లను తయారు చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. చక్కెర, యాలకులు, ఇతర మసాలా దినుసులు నీళ్లలో మరిగించి పానియం మాదిరి తయారు చేసుకుని సేవించవచ్చు. ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

కఫల్‌ చెట్టు ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. తామర, సోరియాసిస్ సహా వివిధ చర్మ వ్యాధులకు ఆయుర్వేదంలో వీటిని ఉపయోగిస్తారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.