j.p. nadda: కోవిడ్ తో తలిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోండి…బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు జె.పి. నడ్డా లేఖ

కోవిద్-19 తో తమ తలిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవాలని బీజేపీ చీఫ్ జె.పి. నడ్డా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

j.p. nadda: కోవిడ్ తో తలిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోండి...బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు జె.పి. నడ్డా లేఖ
BJP National President JP Nadda

Edited By:

Updated on: May 22, 2021 | 11:07 PM

కోవిద్-19 తో తమ తలిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవాలని బీజేపీ చీఫ్ జె.పి. నడ్డా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ నెల 30 తో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయిందని, కానీ ఆ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకోరాదని, ఆ రోజున ఇలాంటి బాలలను ఆదుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. సంక్షేమ కార్యక్రమాలను ఆ రోజు నుంచి లాంచ్ చేయాలని ఆయన సూచించారు. ఈ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. త్వరలో తగిన ఆదేశాలు, మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని నడ్డా వెల్లడించారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. తన సూచనలకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు నడ్డా పేర్కొన్నారు.

కాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవలే ఈ విషయమై కేంద్రానికి లేఖ రాశారు. అనాధలైన పిల్లలను పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలూ ఆదుకుని వారికి ఉచిత విద్య వంటి సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. పంజాబ్ వంటి కొన్ని రాష్టాలు అప్పుడే తాము ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. తాము నెలకు 1500 రూపాయల చొప్పున ఈ పిల్లలకు సాయం చేస్తామని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ చెప్పగా ,,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాము నెలకు 2,500 రూపాయలు అందిస్తామని ప్రకటించారు.వారికి పాతికేళ్ళు వచ్చేవరకు ఈ సౌలభ్యం ఉంటుందన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పిల్లలకు కోవిద్ సోకవచ్చు …అప్రమత్తత అవసరం, నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీ.కె. పాల్ హెచ్చరిక .. నిపుణుల అధ్యయనం పై దృష్టి పెట్టామని వెల్లడి

Blind Village : ఆ గ్రామంలో మనుషులు, జంతువులు అందరూ గుడ్డివారే..! కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Loading...
Unable to load recommendations.
Follow Us