Watch Video: కొడుకు కాదు.. రాక్షసుడు.. కన్న తండ్రిని నడిరోడ్డుపై.. జనం అడ్డుపడుతున్నా.. వీడియో

|

Sep 20, 2022 | 11:24 AM

ఓ తండ్రి.. కొడుకును అల్లారు ముద్దుగా పెంచి.. పెద్ద చేశాడు. కానీ.. ఆ కొడుకు తండ్రి పాలిట రాక్షసుడిగా మారాడు.. కనీసం వృద్ధుడన్న కనికరం లేకుండా ఇష్టమొచ్చినట్లు విచక్షణారహితంగా కొట్టాడు.

Watch Video: కొడుకు కాదు.. రాక్షసుడు.. కన్న తండ్రిని నడిరోడ్డుపై.. జనం అడ్డుపడుతున్నా.. వీడియో
Son Beaten Father
Follow us on

Son beaten father: ఓ తండ్రి.. కొడుకును అల్లారు ముద్దుగా పెంచి.. పెద్ద చేశాడు. కానీ.. ఆ కొడుకు తండ్రి పాలిట రాక్షసుడిగా మారాడు.. కనీసం వృద్ధుడన్న కనికరం లేకుండా ఇష్టమొచ్చినట్లు విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో వెలుగుచూసింది. కనికరం లేకుండా వృద్ధుడైన కన్నతండ్రిని వీధిలో కొడుతున్న దృశ్యాలు స్థానికులను కలచివేసింది. తండ్రిని కొడుతున్న వీడియోను చిత్రీకరించి స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జోధ్‌పూర్‌ నగరానికి చెందిన తండ్రీ కొడుకు మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం కాస్త ముదరడంతో కొడుకు కన్న తండ్రిపై చేయిచేసుకున్నాడు. విలపిస్తున్నా వదలకుండా కర్రతో చావబాదాడు. స్థానికులు వారించినా వినకుండా వీధంతా తిప్పుతూ కనికరం లేకుండా దాడి చేశాడు.

ఈ షాకింగ్ ఘటన జరిగిన జోధ్‌పూర్‌లోని రతనాడ పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తండ్రిని హింసించిన కొడుకును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తండ్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ ఘటనకు ఒకరోజు ముందు కుమారుడు తన తండ్రితో అనుచితంగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడి చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి