Tribal Girl: పెళ్లి వద్దన్న యువతికి గ్రామ పెద్దలు శిక్ష. గుండె గీసి, చెప్పుల దండేసి ఉరేగింపు.. ఎక్కడంటే

|

May 16, 2023 | 10:14 AM

గత నెల ఏప్రిల్ 19న అమ్మాయి పెళ్లిని ఆమె కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారు. వరుడు తరపు బంధువులు .. వరుడు పెళ్లి ఊరేగింపుగా అమ్మాయి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించింది.. ఇంటి నుంచి పారిపోయింది. ఈ సంఘటన జరిగిన సుమారు 20 రోజుల తరువాత.. ఈ అమ్మాయి తన ఇంటికి తిరిగి వచ్చింది.

Tribal Girl: పెళ్లి వద్దన్న యువతికి గ్రామ పెద్దలు శిక్ష. గుండె గీసి, చెప్పుల దండేసి ఉరేగింపు.. ఎక్కడంటే
Jharkhandgirl
Follow us on

ఆధునిక కాలంలో మనిషి చంద్రమండలానికి వెళ్లినా.. సముద్రం లోతులను కొలుస్తున్నా నేటి మనిషిలో రోజు రోజుకీ దయ, జాలి, కరుణ అనే గుణాలు కనుమరుగవుతున్నాయి. మానవత్వం మరచి మృగంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సంబంధించిన అనేక వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. తాజాగా మానవత్వం సిగ్గుపడే ఘటన ఒకటి జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జోగిడిహ్ గ్రామంలో పంచాయితీ బోర్డు. తుగ్లకీ శాసనం పేరుతో ఓ బాలికకు గుండు గీయించారు. అనంతరం ఆ బాలికపై చెప్పుల దండ వేసి.. బూట్లతో దాడి చేసి బాలికను ఊరేగించారు. ఆ బాలికను గ్రామం చుట్టూ తిప్పిన నిందితులు బాలికను గ్రామం వెలుపలికి తీసుకెళ్లి అడవిలో మరణించు అంటూ వదిలిపెట్టారు. సమాచారం అందుకున్న పటాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు జోగిడిహ్‌ గ్రామానికి చేరుకుని బాధితురాలిని అడవి నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు.  చికిత్స నిమిత్తం మేదిని రాయ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పంచాయితీ బోర్డు గుండు గీసి..  పాదరక్షల దండ వేసి ఊరంతా తిప్పడానికి ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటో తెలుసా..

గత నెల ఏప్రిల్ 19న అమ్మాయి పెళ్లిని ఆమె కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారు. వరుడు తరపు బంధువులు .. వరుడు పెళ్లి ఊరేగింపుగా అమ్మాయి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించింది.. ఇంటి నుంచి పారిపోయింది. ఈ సంఘటన జరిగిన సుమారు 20 రోజుల తరువాత.. ఈ అమ్మాయి తన ఇంటికి తిరిగి వచ్చింది.

ఇవి కూడా చదవండి

గ్రామ పంచాయితీ..
ఈ విషయమై గ్రామంలో గ్రామస్తులు పంచాయితీ పెట్టారు. ఆ అమ్మాయిని క్యారెక్టర్‌లెస్‌గా అభివర్ణిస్తూ, ఊరిలోని మిగతా అమ్మాయిలు ఇలా ఇంటి నుంచి పారిపోకూడదని.. అందుకనే ఆ అమ్మాయికి పాఠం చెప్పాలని భావించారు. దీంతో అమ్మాయికి శిక్ష విధించిన పంచాయితీ బోర్డు ఆ అమ్మాయి జుట్టు గీసి గుండు చేశారు. బూట్ల దండ, చెప్పుల దండ వేసి, కొట్టి, గ్రామంలో ఊరేగించేలా చేశారు. మొత్తం గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు/ అనంతరం ఆ యువతిని గ్రామం వెలివేశారు. ఊరి నుంచి బయటకు తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. అమానవీయంగా ప్రవర్తించడంతో బాలిక మానసిక అస్వస్థతకు గురైంది,

బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో.. తన పట్ల జరిగిన అమానవీయ సంఘటనలో గ్రామస్తులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రమేయం ఉందని పేర్కొంది. పోలీసులు 4 నుండి 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న మరికొందరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

జార్ఖండ్‌లో ఇటువంటి అవమానవీయ ఘటనలు జరగడం ఇదే మొదటిదికాదని..ఇప్పటికే గత నెల ఏప్రిల్ 4న మహుదంద్ పోలీస్ స్టేషన్‌లోని ఓస్రా పంచాయతీకి చెందిన భేదిగ్జర్ జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లా ప్రాంతం మాకు ఒక నివేదిక ఇచ్చింది. వృద్ధ జంటను మంత్రగత్తెలని ఆరోపిస్తూ, గ్రామస్థులు వారి తల నరికి  ఊరేగించారు, అయితే గ్రామస్తులు చేసిన అమానవీయ చర్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు, లతేహర్ జిల్లాకు చెందిన అనేక మంది గ్రామస్తులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..