Jharkhand: ఝార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని రోప్‌వే కేబుల్ కార్ ప్రమాద ఘటనకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది. దాదాపు 45 గంటలకు పైగా కేబుల్ కార్లలో గాలిలో చిక్కుపోయిన 40 మందికి పైగా టూరిస్టులను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రక్షించారు. కాగా ఝార్ఖండ్‌లోని ప్రఖ్యాత త్రికూట పర్వతాల్లో తీగల మార్గంలో సంభవించిన ప్రమాదంలో మంగళవారం మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సహాయకచర్యల్లో భాగంగా తాడు తెగడంతో ఓ మహిళ కిందిపడి మరణించింది. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదం కారణంగా ఇద్దరు మరణించగా.. సహాయక చర్యలు చేపడుతుండగా మరో ఇద్దరు చనిపోయారు. రాగా రెండు వైమానిక దళ హెలికాప్టర్‌లతో పాటుగా పలువురు అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంయుక్త బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని డియోఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మీడియాకు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను భారత వైమానిక దళం ట్విటర్‌లో షేర్ చేసింది.
సుమోటోగా తీసుకున్న హైకోర్టు..
కాగా ఝార్ఖండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా త్రికూట్ కొండలకు బాగా పేరుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం టూరిస్టులు పోటెత్తారు. అయితే దురదృష్టవశాత్తూ సాంకేతిక కారణాలతో వర్టికల్ రోప్ వేలో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. వెంటనే సమచారమందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగి ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాయి. కాగా సహాయచర్యల సమయంలో ఒక వ్యక్తి హెలికాప్టర్ నుంచి జారి, కిందపడి చనిపోయారు. కాగా నేటి ఉదయం కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక మహిళ కిందపడి మృత్యువాత పడింది. కాగా ఈ కేబుల్ కార్లను ఓ ప్రైవేట్ కంపెనీ నడుపుతుందని.. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఆపరేటర్లు అక్కడి నుంచి పారిపోయారని జిల్లా అధికారులు . ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలను ఇంకా నిర్ధారించాల్సి ఉందని వారు తెలిపారు. కాగా ఈ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్న ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఏప్రిల్ 26న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆలోపు ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదికను అఫిడవిట్ ద్వారా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
#IAF has recommenced rescue operations at Deoghar ropeway early morning today.
Efforts are on to rescue each and every stranded person at the earliest.#HarKaamDeshKeNaam pic.twitter.com/06PTraKHBC
— Indian Air Force (@IAF_MCC) April 12, 2022
Praying for her.She is not good I m hearing. https://t.co/L9JBCTouSF
— Manish Shukla (@manishmedia) April 12, 2022
Also Read: Bank Alert: HDFC యూజర్లకు షాక్.. UPI చెల్లింపులకు పరిమితి పెట్టిన బ్యాంక్.. పూర్తి వివరాలు..
Meat-eating: దేశంలో నాన్ వెజ్‌పై కొత్త వివాదం.. మాంసాహారం భారతీయుల ఆహారంలో భాగమేనా..?