
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్‌గామ్‌లో పర్యాటకులను టార్గెట్ చూస్తూ.. ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు.. 20 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంటున్నారు. చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నట్లు పేర్కొంటున్నారు.. అయితే, దీనిని జమ్మూ కాశ్మీర్ పోలీసు యంత్రాంగం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకుని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి..
దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ టీఆర్‌ఎఫ్ ప్రకటించింది.. పహల్‌గామ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన టూరిస్టులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు.. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గుజరాత్, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన పర్యాటకులకు గాయాలయ్యాయి..మృతుల్లో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన టూరిస్టుల మృతి చెందినట్లు తెలుస్తోంది..
ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. అమిత్‌షాను పహల్‌గామ్‌కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధాని మోదీ సూచనలతో అమిత్ షా అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు.. అనంతరం హుటాహుటిన జమ్మూకశ్మీర్ కు బయలు దేరి వెళ్లారు.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah and J&K LG Manoj Sinha depart for Srinagar in the wake of the Pahalgam terrorist attack on tourists pic.twitter.com/k2VMqAcPbF
— ANI (@ANI) April 22, 2025
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ.. దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తాం.. ఉగ్రవాదంపై పోరాడాలన్న మా సంకల్పం దృఢమైంది.. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని.. న్యాయస్థానం ముందు నిలబెడతాం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
PM Narendra Modi tweets, “I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected. Those behind this… pic.twitter.com/CACmIk1b2G
— ANI (@ANI) April 22, 2025
ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖండించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి దిగ్భ్రాంతికరమైనది.. బాధాకరమైనది. ఇది ఒక దుర్మార్గమైన అమానవీయ చర్య అంటూ పేర్కొన్నారు. అమాయక పౌరులపై, పర్యాటకులపై దాడి చేయడం పూర్తిగా క్షమించరానిది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఉగ్రవాద దాడి తర్వాత, పర్యాటకుల సహాయం, సమాచారం కోసం అనంత్‌నాగ్‌లో అత్యవసర సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలీసులను సంప్రదించడానికి, 9596777669, 01932225870 (9419051940 వాట్సాప్) హెల్ప్‌లైన్ నంబర్లు జారీ చేశారు.
కాగా.. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పహల్‌గామ్‌లో అమర్‌నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. ఇప్పటికే అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యింది. ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాదుల కాల్పురల్లో గాయపడ్డ ఓ మహిళా టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికారులకు సమాచారం అందింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..