ఘనంగా సర్దార్ పటేల్ 148వ జయంతి.. ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనం జరిగాయి. యావత్ దేశం ఆయనను స్మరిస్తోంది. ఈ సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేతృత్వంలో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా సర్దార్ పటేల్ 148వ జయంతి.. రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan In Run For Unity

Updated on: Oct 31, 2023 | 5:48 PM

ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనం జరిగాయి. యావత్ దేశం ఆయనను స్మరిస్తోంది. ఈ సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేతృత్వంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరోవైపు సర్దార్ పటేల్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దీనితో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు నాయకులు పటేల్ చౌక్‌లో దేశ మొదటి హోం మంత్రికి నివాళులర్పించడం ద్వారా సర్దార్ పటేల్‌ను స్మరించుకున్నారు.

గుజరాత్‌లోని కెవాడియాలో 182 మీటర్ల ఎత్తైన పటేల్ విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు మోదీ. ఈ పరేడ్‌లో మహిళా CRPF సిబ్బంది నిర్వహించిన సాహసోపేతమైన ఫీట్‌ను మోదీ ప్రశంసించారు. ఇక దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీలో భాగంగా దేశ సమైక్యత కోసం పిల్లలు, పెద్దలు, యువత, మహిళలు పరుగులు తీశారు. జనమంతా ఉత్సాహంగా తెల్లటి రంగు టీషర్టులు, షర్టులు ధరించి, తమ చేతుల్లో నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేశారు.

ఇది కాకుండా, మరికొన్ని చిత్రాలను ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. చిత్రాలతో పాటు, ప్రతి భారతీయుడి హృదయంలో సర్దార్ పటేల్ ఎప్పటికీ సజీవంగా ఉంటారని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. దేశాన్ని ఏకం చేసి రూపుదిద్దినందుకు ఆయనకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. దీనితో పాటు కటక్ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాశారు. ఈ సందర్భంగా, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన దేశంగా మార్చాలనే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ పునరుద్ఘాటించాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీని రాజధాని లక్నోలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లోని పంజాబ్ రెజిమెంటల్ సెంటర్‌లో వందలాది మంది సైనికులు పరుగులు తీశారు. దీనితో పాటు రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో రన్ ఫర్ యూనిటీని కూడా నిర్వహించారు. ఇక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి పచ్చజెండా ఊపి రన్ ను ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…