Inspiration Story: ఐఏఎస్ జాబ్‌ని వదిలి.. నేడు రూ .14,000 కోట్ల కంపెనీకి అధినేతగా మారిన ఓ యువకుడి సక్సెస్ స్టోరీ..

|

Sep 13, 2021 | 2:11 PM

Inspiration Story:నేటి యువత చదువు కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. ఇక ప్రయివేట్ సంస్థల్లో ఎన్ని మంచి జీతానికి ఉద్యోగం చేసినా ప్రభుతం ఉద్యోగం వస్తే బాగుండును అని భావిస్తారు. ఇక ఐఏఎస్ , ఐపిఎస్ లు..

Inspiration Story: ఐఏఎస్ జాబ్‌ని వదిలి..  నేడు రూ .14,000 కోట్ల కంపెనీకి అధినేతగా మారిన ఓ యువకుడి సక్సెస్ స్టోరీ..
Roman Saini
Follow us on

Inspiration Story:నేటి యువత చదువు కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. ఇక ప్రయివేట్ సంస్థల్లో ఎన్ని మంచి జీతానికి ఉద్యోగం చేసినా ప్రభుతం ఉద్యోగం వస్తే బాగుండును అని భావిస్తారు. ఇక ఐఏఎస్ , ఐపిఎస్ లు లక్ష్యంగా చదువుని సాగించేవారు ఎందరో ఉన్నారు. అయితే ఓ యువకుడు మాత్రం చిన్నతనంలోనే డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. వైద్యుడిగా సేవలను అందిస్తూనే.. 22 ఏళ్లకే సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ గా బాధ్యతలను స్వీకరించారు. కొంతకాలం తర్వాత చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపేరయ్యే పేద విద్యార్థులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. కొన్ని కోట్లకు అధిపతిగా మారారు.. అతను 16 సంవత్సరాల వయస్సులో వైద్య పరీక్షల్లో పాసై.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి.. 22 ఏళ్ళ వయసులో ఐఏఐ అధికారి అయ్యారు. అనంతరం ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. ఇప్పుడు అకంపెనీకి సహవ్యవస్థాపకుడిగా పనిచేస్తూ.. సమాజానికి తనవంతు సేవలను అందిస్తున్నారు. . అతను కౌంటీలో అతి పిన్న వయస్కుడైన ఐఏఎస్ ప్లస్ డాక్టర్ కాంబినేషన్డు ఉద్యోగి. గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా బోధన చేస్తూ ఇతరులకు సహాయం చేస్తున్నారు. ఇది రోమన్ సైనీకి స్ఫూర్తిదాయకమైన కథ.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రోమన్ సైని చిన్నప్పటి నుంచే చదువులో మంచి చురుకుగా ఉండేవారు. చదువులో రోమన్ తెలివితేటలు , ప్రతిభాపాటవాలు అందరికి ఆశ్చర్యాన్నిచ్చేవి. 16ఏళ్ల వయసులో ఎయిమ్స్ అడ్మిషన్ ఎగ్జామ్‌లో విజయం సాధించారు. 18ఏళ్ల వయసులో రోమన్ సైని.. ఓ అంశంపై రీసెర్చ్ పూర్తి చేశారు. ఇదే విషయంపై అప్పట్లో మెడికల్ పబ్లికేషన్‌లో కథనాలు ప్రచురితమయ్యి కూడా. ఇక ఎంబీబీఎస్ పూర్తి చేసిన రోమన్ సైని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్‌(ఎన్‌డీడీటీఎస్)లో కొంతకాలం ఉద్యోగం చేశారు. అప్పుడు హర్యానాలోని మారుమూల గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ప్రజలకు మరింత సేవలను చేయాలన్నా ఇబ్బందులను తీర్చాలన్నా సివిల్ సర్వీస్‌ మంచి దారిని భావించారు. దీంతో అప్పుడే రోమన్ దృష్టి సివిల్ సర్వీసెస్‌పై పడింది.

కేవలం ఆరునెల్లలోనే తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన రోమన్ సైని సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. 22ఏళ్ల వయసులో సివిల్ సర్వీసెస్ టెస్టును రోమన్ సైని క్రాక్ చేశారు. ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న ఆయన మొదటిసారి సెలక్ట్ అయ్యారు. ఇక రోమన్ సైనీ శిక్షణను పూర్తి చేసుకుని.. చిన్న వయసులోనే మధ్యప్రదేశ్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో రోమన్ దేశంలోనే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పిన్నవయస్కులలో ఒకరిగా గుర్తింపు పొందారు. అయితే ఆ ఉద్యోగం మానసిక సంతృప్తిని ఇవ్వ లేదంటూ..ఎంతో ఇష్టపడి.. కష్టపడి సాధించిన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకున్నారు.

నిరుద్యోగులకు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పేదవారికి ఏదైనా చెయ్యాలనే తపనతో .. రోమన్ సైనీ తన స్నేహితులైన గౌరవ్ ముంజల్, ముంజల్, హేమేశ్ సింగ్ లతో కలిసి సైనీ ‘అనకాడమీ’ అనే ఆన్‌లైన్ శిక్షణా సంస్థను నెలకొల్పారు. యూపీఎస్పీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధింన క్లాసులు చెప్పడం ప్రారంభించారు. దీంతో ఈ ‘అనకాడమీ’ లో ప్రస్తుతం దాదాపు 18వేల మంది ట్యూటర్‌లు పనిచేస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఇందులో కోచింగ్ తీసుకుంటున్నారు. పేద వర్గానికి చెందిన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘అనకాడమీ’ కంపెనీ విలువ ప్రస్తుతం 14,830కోట్లకు చేరుకుంది.

Also Read: Ayurveda Laddu: రక్తహీనతతో బాధపడుతున్నారా.. మెడిసిన్స్ బదులు ఈ లడ్డు తినిచూడండి.. అద్భుత ఫలితం మీ సొంతం..