India’s First Igloo Cafe : కరోనా వైరస్ కారణంగా గత ఏడాది టూరిజం పై ఆధారపడే దేశాలు, ప్రాంతాలు విపరీతంగా నష్టపోయాయి. అలా నష్టపోయిన ప్రాంతం జమ్మూకాశ్మీర్. కోవిడ్ కారణంగా టూరిజం బాగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశం.. తిరిగి అభివృద్ధి వైపు దృష్టి పెట్టారు.. పర్యాటకులను ఆకర్షించే పనిలో పడ్డారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు.. తాజగా ఓ రెస్టారెంట్ యజమాని డిఫరెంట్ గా ఆలోచించాడు.. ఓ ఇగ్లూ కేఫేనే నిర్మించాడు..
జమ్మూకాశ్మీర్ లో గుల్‌మార్గ్‌లోని కొలహోయి స్కీ రిసార్ట్ నిర్మించిన ఈ ఇగ్లూ కేఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కేఫ్‌లో ఉన్న టేబుల్స్ కూడా మంచుతోనే చేసినవి కావడం విశేషం. చల్ల చల్లని కేఫ్‌లో వేడివేడి ఆహార పదార్థాలను తినడానికి టూరిస్టులు క్యూ కడుతున్నారు. 15 అడుగుల ఎత్తు, 26 అడుగుల చుట్టుకొలతతో నిర్మించిన ఈ ఇగ్లూ కేఫ్‌లో నాలుగు టేబుల్స్ ఉన్నాయి. ఒకేసారి 16 మంది కూర్చోవచ్చు. ఈ కేఫ్ ముందు ఫొటోలు తీసిన టూరిస్టులు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. అవి చూసిన వారు ఆ ఇగ్లూ కేఫే గిరించి ఆరాతీయడం రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతోనైనా తాను నష్టాల నుంచి బయటపెడతానని ఆ రెస్టారెంట్ యజమాని భావిస్తున్నాడు.
Also Read: షుగర్ వ్యాధి ఉన్నవారికి జామ ఆకుల టీ ఎంత మంచిదో తెలుసా..!