మాల్దీవుల నుంచి భారత్ చేరిన నౌక.. ఇండియన్స్ అంతా సేఫ్

| Edited By: Anil kumar poka

May 10, 2020 | 12:37 PM

ఇండియా నుంచి మాల్దీవులకు వెళ్లిన ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో 698 మంది భారతీయులు సురక్షితంగా ఆదివారం ఉదయం కేరళలోని కొఛ్చి రేవుకు చేరుకున్నారు. వీరేయిలో 19 మంది గర్భిణులు కూడా ఉన్నారు..

మాల్దీవుల నుంచి భారత్ చేరిన నౌక.. ఇండియన్స్ అంతా సేఫ్
Follow us on

ఇండియా నుంచి మాల్దీవులకు వెళ్లిన ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో 698 మంది భారతీయులు సురక్షితంగా ఆదివారం ఉదయం కేరళలోని కొఛ్చి రేవుకు చేరుకున్నారు. వీరేయిలో 19 మంది గర్భిణులు కూడా ఉన్నారు. ఈ నెల 8 న మాల్దీవుల రాజధాని మాలె నుంచి బయల్దేరిన ఈ నౌక ఈ ఉదయం 9.45 గంటలకు ఈ రాష్ట్రానికి చేరింది. ఈ ప్రయాణ సమయంలో తమ బాగోగులు చూసుకున్నందుకు నేవీ సిబ్బందికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. తామెంతో సురక్షితంగా ఉన్నామని, నేవీ స్టాఫ్ ఫ్రెండ్లీగా ఉన్నారని మరో ప్రయాణికుడు చెప్పాడు. మాల్దీవుల నుంచి వీరి తరలింపునకు 40 అమెరికా డాలర్లను సర్వీసు చార్జిగా వసూలు చేశారు. అక్కడ భారతీయులంతా నౌక ఎక్కే ముందు ముఖాలకు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ క్రమ వరుసలో నిలబడిన దృశ్యాల తాలూకు వీడియోలను అక్కడి ప్రసార మాధ్యమాలు ప్రసారం చేశాయి.