Indian Railway: అర్థాంతరంగా రద్దవుతున్నాయి.. ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుతున్నాయి.. రైల్వే తీరుతో ప్రయాణికులు సతమతం

|

Apr 29, 2022 | 5:08 PM

వేసవి కావడంతో దేశంలో విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. ఫలితంగా బొగ్గుకు డిమాండ్‌ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ లోనూ కొనసాగితే తీవ్ర పరిమాణాలు ఉంటాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం...

Indian Railway: అర్థాంతరంగా రద్దవుతున్నాయి.. ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుతున్నాయి.. రైల్వే తీరుతో ప్రయాణికులు సతమతం
Follow us on

వేసవి కావడంతో దేశంలో విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. ఫలితంగా బొగ్గుకు డిమాండ్‌ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ లోనూ కొనసాగితే తీవ్ర పరిమాణాలు ఉంటాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బొగ్గు నిల్వలు తగ్గిపోకుండా ఉండేందుకు రైల్వే శాఖ(Indian Railways) ప్యాసింజర్‌ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపిస్తోంది. దేశంలో 70 శాతం కరెంట్‌ బొగ్గు(Coal) నుంచే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్‌ కోతలోనే ఉన్నాయి. బొగ్గు కొరత కారణంగా కొన్ని పరిశ్రమలు ఉత్పత్తినీ తగ్గించేశాయి. మొత్తంగా 670 ప్యాసింజర్‌ ట్రిప్పులను మే 24వ తేదీ వరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటన విడుదల చేసింది. అయితే ఏయే రూట్‌లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్‌ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతి త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని చెప్పింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.

బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కుంటోంది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టం అవుతోంది. రద్దీగా ఉండే రూట్లలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తీవ్రంగా ఆగాల్సి వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్‌.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్‌ను దాద్రి-2, ఊంచహార్‌ ప్లాంట్‌ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

AP 10th Exams Paper Leak: 3 రోజులుగా లీకౌతున్న టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్లు! నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న విద్యాశాఖ..?