Indian Railways: అనివార్య కారణంతో రైలు ఒక్క నిమిషం ఆగితే ఎంత నష్టమో తెలుసా?

|

Apr 20, 2022 | 12:03 PM

Railway News - Indian Railways: దేశ ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వే శాఖది కీలక పాత్ర. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ నిత్యం కోట్లాది మందిని ఒక చోటి నుంచి మరోచోటికి చేరవేస్తుంది. అందుకే ఎందరో జీవితాలతో రైల్వేకి విడదీయరాని అనుబంధం ఏర్పడింది.

Indian Railways: అనివార్య కారణంతో రైలు ఒక్క నిమిషం ఆగితే ఎంత నష్టమో తెలుసా?
Railway News
Follow us on

Indian Railways: దేశ ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వే శాఖది కీలక పాత్ర. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను ఒక చోటి నుంచి మరోచోటికి చేరవేస్తుంది. అందుకే ఎందరో జీవితాలతో రైల్వేకి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మిగిలిన ప్రజా రవాణా వ్యవస్థలతో పోల్చితే రైల్వే ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండటం, సురక్షితం కావడం ప్రయాణీకులకు పెను ఊరట కలిగించే అంశం. అలాగే సరైన సమయానికి ప్రయాణీకులను వారి గమ్య స్థానాలకు చేర్చడం ద్వారా రైల్వే శాఖ నిత్యం ప్రయాణీకుల మన్ననలు పొందుతోంది. అయితే అనివార్య కారణాలతో తాము ప్రయాణించే రైలు ఆలస్యమైతే  ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. వాస్తవానికి ఏదైనా ప్రమాదం జరిగే.. మరేదైనా కారణం చేతనో రైలు కొన్ని నిమిషాలు ట్రాక్‌పై ఆగితే రైల్వే శాఖ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

మరీ ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లపై అవులు, గొర్రెల మందలు, ఏనుగులు నిలిచిపోవడం వంటి కారణాలతో రైళ్ల రాకపోకలకు ఆలస్యం కలుగుతుంది. అలాగే దీని ద్వారా రైల్వే శాఖ ప్రతి ఏటా భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోంది. తాజాగా పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో ట్రాక్‌పై గొర్రెల మంద నిలిచి ఉండటంతో గూడ్స్ రైలు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 116 కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో రైల్వే శాఖకు భారీ నష్టం సంభవించింది.

గతంలో సమాచార హక్కు చట్టం (RTI) వెలువడిన సమాచారం ప్రకారం.. డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్క నిమిషం ఆగితే.. రూ.20,401 నష్టం వాటిళ్లుతుంది. అదే ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే ఒక్కో నిమిషానికి రూ.20,459 నష్టం వాటిల్లుతుంది. గత కొన్ని మాసాలుగా డీజిల్ ధరలు పెరగడంతో.. ఈ నష్టం మరింత పెరిగింది. ఏదైనా కారణం చేత రైలు ఐదు నిమిషాల పాటు ట్రాక్‌పై ఆగాల్సి వస్తే ఏకంగా రూ.1 లక్ష మేరకు నష్టంవాటిళ్లుతుంది.

అనివార్య కారణాలతో రైలు ట్రాక్‌పై ఆగితే.. దాని వెనుక వస్తున్న రైళ్లు కూడా ఆపాల్సి వస్తుంది. తద్వారా ఎంత నష్టం వస్తుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ కారణంగా ఒక్క ట్రైన్ కాసేపు ఆగాల్సి వచ్చినా.. ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే గొర్రెలు, అవులు ట్రాక్‌పైకి రాకుండా జనావాస ప్రాంతాల్లో ట్రాక్‌కు ఇరువైపులా పటిష్ట పటిష్టమైన కంచెను ఏర్పాటు చేసే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది.

రైల్వే శాఖ అధికారిక గణాంకాల మేరకు 2021-22 సంవత్సరంలో రైళ్లు దూసుకుపోవడంతో 26,142 మూగజీవాలు మృతి చెందగా.. ఇదే కాలంలో 10,919 మంది మృతి చెందారు.

Also Read..

Viral Video: బైక్ నుంచి వింత శబ్దాలు.. భయంతోనే చెక్ చేస్తుండగా గుండె గుభేల్.!

Kajal Aggarwal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ .. సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్..