
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వార్‌లో భీకరమైన ఎన్‌కౌంటర్ కొనసాగింది. రెండు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉంటూ, ఇజ్రాయెల్ గ్రూప్‌గా పేరున్న ఓ కరడుగట్టిన ఉగ్ర ముఠా హతమైంది. దీంతో రాజధాని ఢిల్లీలో లష్కరే తోయ్‌బా టెర్రర్ కుట్ర భగ్నమైంది. క్రాస్‌బార్డర్ డ్రగ్ మార్కెటింగ్ చేస్తున్న 145 మంది క్రిమినల్స్ పంజాబ్‌లో ఫసక్ అయ్యారు. బ్యాక్‌టుబ్యాక్ బిగ్‌బ్రేకింగ్స్‌తో పీక్స్‌లో ఉంది మనోళ్ల కౌంటర్ పెర్ఫామెన్స్. ఇదంతా ఆపరేషన్ ప్రహార్‌కి ఆరంభానికి శుభసూచికమేనా..?
ఉగ్రవాదంపై ఉక్కుపాదానికి కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త పాలసీ… పేరు ప్రహార్. P ఫర్ ప్రివెన్షన్, R ఫర్ రెస్పాన్స్, A ఫర్ అగ్రివేటింగ్, H ఫర్ హ్యూమన్ రైట్స్, A ఫర్ అట్యునేటింగ్, A ఫర్ అలైనింగ్, R ఫర్ రికవరీ.. అందర్నీ కలుపుకుని స్థిరంగా రికవరీ కావడం. టోటల్‌గా ప్రహార్.. టెర్రరిజమనే మర్రి చెట్టును వేరు దశ నుంచే తుంచి పారేసే మహామంత్రం.
అల్‌ఖైదా, ఐసిస్ నుంచి ముప్పు పొంచివున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలని డిసైడైంది కేంద్రం. బయోకెమికల్, న్యూక్లియర్, డిజిటల్ టెర్రర్ ఎటాక్స్‌కి మన దేశం సేఫ్ హెవెన్‌గా మారిందని పసిగట్టిన కేంద్ర హోంశాఖ, దాన్ని నిరోధించడానికే ప్రహార్ పేరుతో కొత్త పాలసీ రాసుకుంది. అవసరమైతే విదేశీ సంస్థల సాయం కూడా తీసుకుని, కౌంటర్ ఎటాక్స్ చేయాలన్నదే ప్రహార్ స్ట్రాటజీ.
దీని కోసం IBలో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం, ఉగ్రవాదుల ఏరివేతలో NIA, NSGతో రాష్ట్ర పోలీసుల్ని సమన్వయం చేసుకోవడం, యువత ఉగ్రవాదంపై వైపు ఆకర్షితులు కాకుండా ఫోకస్ పెట్టడం.. ఇలా పిన్‌టు పిన్ క్లిస్టర్ క్లియర్‌గా చేపట్టేదే ఆపరేషన్ ప్రహార్. బైటి దేశాలనుంచి పొంచి ఉన్న ముప్పునుంచి బైటపడ్డానికి స్టార్ట్ కాబోతోంది ఆపరేషన్ ప్రహార్. అటు, దేశంలో అంతర్గత తీవ్రవాదాన్ని క్లయిమాక్స్‌లోకి తీసుకొస్తోంది ఆపరేషన్ కగార్.
2026 మార్చి నెల 21వ తేదీ.. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పెట్టుకున్న డెడ్‌లైన్. మహా అయితే మరో నెల రోజులే గ్యాపుంది. అందుకే, భారీ కూంబింగ్ ఆపరేషన్లతో అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని, మావోయిస్టు రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతమే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంతో ఆపరేషన్ కగార్ పేరుతో విరుచుకుపడ్తున్న భద్రతా దళాలు, వరస కూంబింగ్ ఆపరేషన్లతో దడ పుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి 19న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు చనిపోవడం.. ఇటీవలే నక్సల్ అగ్రనేత దేవ్‌జీ పోలీసుల ఎదుట లొంగిపోవడం.. ప్రస్తుత పరిస్థితుల్లో సరెండర్ కంటే బెస్ట్ ఆప్షన్ లేనేలేదన్న స్టేట్‌మెంట్స్ వినిపించడం.. ఇవన్నీ దేనికి సంకేతాలు?
నిజానికి, మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ అనే మాట రొటీన్‌గా మారిపోయింది. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టుల్లో ఫియర్ ఫ్యాక్టర్‌ని అనుకూలంగా మార్చుకుని, లొంగుబాట్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా కదులుతోంది హోంశాఖ. సో, క్లయిమాక్స్‌లో కగార్ ఆపరేషన్, ఇప్పుడే షురూ ఐన ఆపరేషన్ ప్రహార్. మాంచి యాక్షన్ సినిమా చూపిస్తున్నట్టుంది ఇండియన్ హోమ్ మినిస్ట్రీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..