India Corona Cases: దేశంలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ ప్రభావం.. 51,667 పాజిటివ్ కేసులు నమోదు..

India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల...

India Corona Cases: దేశంలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ ప్రభావం.. 51,667 పాజిటివ్ కేసులు నమోదు..
Corona

Updated on: Jun 25, 2021 | 10:18 AM

India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారతదేశం వ్యాప్తంగా 51,667 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో ఒక్క రోజులోనే కరోనా వైరస్ ప్రభావంతో 1,329 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 64,527 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు భారత వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,01,34,445 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,91,28,267 మంది కోలుకోగా.. 3,93,310 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 6,12,868 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గత పదిహేడు రోజులుగా కరోనా పాజిటివ్ రేటు 2.91 శాతం ఉంది. ఇక వీక్లీ పాజిటివ్ రేటు 5శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయి 3.04 శాతంగా ఉంది. ఇదే సమయంలో రికవరీ రేటు 96.61 శాతంగా ఉంది.

ఇక కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉధృతం చేసింది. ప్రతీ ఒక్కరికీ వ్యాక్సీన్ వేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో 64.89 లక్షల వ్యాక్సీన్ డోసులను వేశారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 30,79,48,744 డోసుల వ్యాక్సీన్ వేశారు.

 Also read:

Viral News: రాత్రుళ్లు గుర్రంపై ఊరేగుతున్న తలలేని దెయ్యం.. అక్కడ నిద్రపోతే ఇక అంతే.. బెంబేలెత్తుతున్న జనం!

Rubiks Cube World Record : సచిన్ టెండూలర్క్‌ను ఫుల్ ఫిదా చేసిన ఆ కుర్రాడు మరో అద్భుతం సాధించాడు

Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్లు.. ఒక్క ఫోన్‌కాల్‌ చేసి రూ. 83 లక్షలు కాజేశారు.. పూర్తివివరాలు తెలిస్తే షాక్ అవుతారు..