IAF Agniveer Jobs 2026: ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైన వారు అర్హులు

భారత వాయుసేనలో..2026 సంవత్సరానికి అగ్నిపథ్‌ స్కీంలో కింద అగ్నివీర్‌ వాయు నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ స్వీకరణ అధికారిక వెబ్‌సైట్‌లో కొనసాగుతుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద..

IAF Agniveer Jobs 2026: ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైన వారు అర్హులు
Indian Airforce Agniveer Vayu Recruitment

Updated on: Jan 26, 2026 | 8:57 AM

హైదరాబాద్‌, జనవరి 26: కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేనలో..2026 సంవత్సరానికి అగ్నిపథ్‌ స్కీంలో కింద అగ్నివీర్‌ వాయు నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ స్వీకరణ అధికారిక వెబ్‌సైట్‌లో కొనసాగుతుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు బ్యాచ్ రిక్రూట్‌మెంట్ ద్వారా అర్హులైన అవివాహిత పురుషుల, మహిళా అభ్యర్థుల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్‌ధులు ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా మెకానికల్‌/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్‌/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ ఇన్‌ఫర్‌మెషన్‌ టెక్నాలజీ విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి లేదా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో రెండేళ్ల వొకేషనల్‌ లేదా నాన్‌ వొకేషనల్‌ ఉత్తీర్ణత పొందాలి. సైన్స్ సబ్జెక్టులు కాకుండా ఇతర గ్రూప్‌లలో ఇంటర్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అలాగే అభ్యర్ధులు తప్పనిసరిగా జనవరి 1, 2006 నుంచి జులై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. అంటే వయసు 21 ఏళ్లకు మించి ఉండకూడదు. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే జనవరి 12 నుంచి ప్రారంభం అయింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఫిబ్రవరి 1, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.