Bribery Risk Rankings: లంచాల సమస్య ఏయే దేశాల్లో ఎక్కువ? ఏయే దేశాల్లో తక్కువ? భారత్‌లో పరిస్థితి ఏంటి..

|

Jan 11, 2022 | 9:46 AM

Global Bribery Risk Rankings: వర్తమాన దేశాలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో అవినీతి, లంచగొండి రక్కసి కూడా ఒకటి. ఆ దేశాల అభివృద్ధికి ఇది పెద్ద ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.

Bribery Risk Rankings: లంచాల సమస్య ఏయే దేశాల్లో ఎక్కువ? ఏయే దేశాల్లో తక్కువ? భారత్‌లో పరిస్థితి ఏంటి..
Follow us on

Global Bribery Risk Rankings: వర్తమాన దేశాలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో అవినీతి, లంచగొండి రక్కసి కూడా ఒకటి. ఆ దేశాల అభివృద్ధికి ఇది పెద్ద ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. భారత్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ లంచాల ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. 2021 సంవత్సరానికి సంబంధించిన ర్యాంక్‌లో ఐదు స్థానాలు దిగజారిన భారత్ 82వ స్థానంలో నిలిచింది. ట్రేస్ అనే సంస్థ ‘బ్రైబరీ రిస్క్ మ్యాట్సిక్’ పేరుతో 194 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. గత ఏడాది 45 స్కోర్‌తో 77వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది(2021) 44 పాయింట్లతో 82వ స్థానానికి పడిపోయింది.

అయితే పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా భారత్ మెరుగైన స్థానంలో ఉండటం విశేషం. ఈ బ్రైబరీ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ 150వ స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 167, నేపాల్ 112, శ్రీలంక 92, ఆఫ్గనిస్థాన్ 174వ స్థానాల్లో ఉన్నాయి. లంచం సమస్య చైనాలో భారత్ కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. 2020లో 126వ స్థానంలో నిలిచిన చైనా.. 2021లో 9 పాయింట్లు దిగజారి 135వ స్థానంలో నిలిచింది.

2014 నుంచి ఈ ర్యాంకింగ్స్‌లో భారత్ తన స్థానాన్ని ఎంతో మెరుగుపరుచుకుంది. 2014లో 185వ స్థానంలో నిలవగా.. 2016లో 178, 2017లో 88, 2018లో 86, 2019లో 78, 2020లో 77వ స్థానంలో భారత్ నిలిచింది.

లంచాల సమస్య ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాలకంటే ఉత్తర కొరియాలో అత్యధికంగా ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది. ఆ తర్వాతటి స్థానాల్లో తుర్కెమొనిస్థాన్, వెనెజులా, ఎరిత్రియా దేశాలు నిలిచాయి.  డెన్కార్క్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్ దేశాల్లో లంచం సమస్య అతి తక్కువగా ఉన్నట్లు తేలింది.

Also Read..

Viral Video: ఆవు పేడను తింటోన్న ఎంబీబీఎస్‌ డాక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

AP Assembly: అసెంబ్లీ బీఏసీలో ఆసక్తికర చర్చ.. సీఎం నిర్ణయం చారిత్రాత్మకంః మంత్రి బుగ్గన