Covid-19: దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Coronavirus Updates: కరోనావైరస్ డైలీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ

Covid-19: దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Coronavirus In India

Updated on: Apr 11, 2022 | 9:43 AM

India Coronavirus Updates: కరోనావైరస్ డైలీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ వేయికి దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతుండగా.. మూడు రోజుల నుంచి కేసులు వేయి దాటి నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య మళ్లీ వేయికి దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా 861 కరోనా కేసులు (Corona) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 11,058 (0.03%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,36,232 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,691 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 929 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,03,383 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,85,74,18,827 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 2,44,870 టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

BJP – TRS: డైలాగుల్లోనే కాదు.. ఉద్యమ కార్యాచరణలోనూ తగ్గేదే లే.. ఢిల్లీకి హైదరాబాద్‌లో బీజేపీ కౌంటర్‌..

Skin Care Tips: వేసవిలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటే.. ఈ ఫేస్ మిస్ట్‌లను ట్రై చేయండి..