
India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) కేసుల సంఖ్య రెండు లక్షలకు దిగువగానే నమోదైంది. దేశవ్యాప్తంగా నిన్న 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1733 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో కేంద్రం గణాంకాలను ఎక్కువగా చూపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. రోజూవారి పాజిటివిటీ రేటు ప్రస్తుతం 11 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 2,81,109 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,21,603 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. 3,95,11,307 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఈ మహమ్మారి కారణంగా 4,97,975 మంది ఇప్పటివరకు మరణించారు.
కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 167.29 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.
Also Read: