మూడు బిల్లులాట.. ఎందుకు డిజాస్టరైంది? ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు

ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎందుకు వీగిపోయినట్టు? నిజానికి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023 అక్టోబర్‌లోనే ఉభయసభలూ ఆమోదం తెలిపాయి. ఇందుకోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే, అన్ని పార్టీల సపోర్ట్‌తో బంపర్ మెజారిటీతో మహిళాబిల్లు చట్టంగా మారింది. కాకపోతే, అప్పుడు నిర్ణయించినట్టుగా డిలిమిటేషన్ పూర్తయ్యాక 2034 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది.

మూడు బిల్లులాట.. ఎందుకు డిజాస్టరైంది? ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు
Delimitation Bill

Updated on: Apr 18, 2026 | 9:50 PM

ఒకటి-మహిళా రిజర్వేషన్ చట్టాన్ని పాత జనాభా లెక్కల ప్రకారమే అమలు చేసేలా రాజ్యాంగ సవరణ కోరేది. రెండోది- నియోజకవర్గాల పునర్విభజన అమలు కోసం కమిషన్ ఏర్పాటుకు అనుమతి కోరేది. మూడోది- కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్ల సంఖ్య పెంపునకు సంబంధించింది. ఇవీ గురువారం పార్లమెంటు టేబుళ్లమీదికొచ్చిన మూడు బిల్లులు. ఈ మూడూ ఒకదానితో ఒకటి లింకున్నవే. పైగా, మూడింటినీ ఒకేగాటన కట్టి, సింగిల్‌ స్ట్రోక్‌తో పార్లమెంటు ఆమోదం పొందాలన్న కేంద్రప్రభుత్వం ఆలోచనే బూమరాంగైందా? మహిళా కోటాకు, డీలిమిటేషన్‌కు లింకు పెట్టి, ఆవిధంగా లబ్ది పొందాలనుకుని, అసలుకే మోసమొచ్చేలా చేసిందా? కన్‌ఫ్యూజన్‌కి గురైన అపోజిషన్‌ కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చెయ్యబోయి ఓవరాక్షన్‌కు పోయిందా? ఇక్కడ ఎవరిది తొందరపాటు, ఎవరిది తొట్రుపాటు? తలుపు తట్టిన బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకుని, ఇప్పుడు లబోదిబోమంటున్నదెవరు? లోక్‌సభలో శుక్రవారం నాటి ఓటింగ్‌లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేది అటుంచితే, జరిగిన నష్టం మాత్రం అపారం. పునర్విభజన, దాంతో పాటే మహిళా రిజర్వేషన్‌ వెనక్కెళ్లిపోయాయి. ఒక్క ఓటుతో రెండు పోట్లు. బంగారంలాంటి వరాన్ని కాలదన్నుకున్న ఫలితం- దేశానికి దశాబ్దమంత దురదృష్టం. ఇదైతే పక్కా. ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్వరూపాన్నే సమూలంగా మార్చిపారేసే రెండు అత్యంత కీలక అంశాలివి. అధికార-విపక్షాలు రెండూ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి