Corona Vaccine orders: 14.5 మిలియన్ల టీకాలకు ఆర్డర్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలో రష్యా టీకాకు అనుమతులు..!

|

Feb 09, 2021 | 11:49 PM

Corona Vaccine orders: కోవిడ్‌ టీకాలో భారత్‌ దూసుకెళ్తోంది. ఈ టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు మరిన్ని టీకా డోసుల కోసం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ఉత్తర్వులను ..

Corona Vaccine orders: 14.5 మిలియన్ల టీకాలకు ఆర్డర్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలో రష్యా టీకాకు అనుమతులు..!
Follow us on

Corona Vaccine orders: కోవిడ్‌ టీకాలో భారత్‌ దూసుకెళ్తోంది. ఈ టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు మరిన్ని టీకా డోసుల కోసం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ఉత్తర్వులను జారీ చేసింది. సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి 10 మిలియన్ల కొవిషీల్డ్‌ టీకాలు, భారత్‌ బయోటెక్‌ నుంచి 4.5 మిలియన్ల కోవాగ్జిన్‌ టీకాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌ ఇచ్చింది. 10 మిలియన్ల డోసుల కోసం మాకు రెండో ఆర్డర్‌ అందింది అని సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధి మీడియాకు తెలిపారు.

100 మిలియన్ల కొవిషీల్డ్‌ డోసుల కోసం కేంద్ర సర్కార్‌ ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఆర్డర్‌ను ఇచ్చింది. దానిలో భాగంగా ఒక్కో డోసును రూ.200కు అందిస్తోంది. ఇప్పటికే 5.5 మిలియన్ల డోసులను సరఫరా చేశామని బయోటెక్‌ సంస్థ తెలిపింది. మరో 4.5 మిలియన్ల డోసులను విక్రయించనున్నట్లు వెల్లడించింది. జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా 24 రోజుల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మందికిపైగా టీకాలను ఇచ్చింది. ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టకాలను పంపిణీ చేస్తోంది. అలాగే మరి కొన్ని నెలల్లో రష్యా డెవలప్‌ చేసిన స్పుత్నిక్‌-వి, క్యాడిలా హెల్త్‌ కేర్‌ టీకాలను మన దేశంలో అనుమతులు లభించనున్నట్లు సమాచారం.

Also Read: Covid-19 Vaccine: కోవిడ్‌ టీకాకు ఎలాంటి బీమా సదుపాయం లేదు.. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన ఆరోగ్యశాఖ సహాయ మంత్రి