Free Train: ఈ రైల్లో ప్రయాణించే వారికి టికెట్‌ అవసరం లేదు.. ఎలాంటి భయంలేని ఉచిత ప్రయాణం..!

|

Nov 18, 2024 | 11:49 AM

టికెట్ లేని రైలు ప్రయాణం చట్టవిరుద్ధం. పట్టుబడితే, జరిమానాతో పాటు జైలు వరకు శిక్ష పడుతుంది. కానీ, మన దేశంలో టికెట్ కొనాల్సిన అవసరం లేని రైలు నడుస్తోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రైలులో మీ టిక్కెట్‌ను చెఖ్ చేయడానికి ఏ టీటీఈ, ఎవరూ రారు. స్టేషన్‌లో దిగిన తరువాత కూడా మీ టిక్కెట్‌ను ఎవరూ అడగరు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Free Train: ఈ రైల్లో ప్రయాణించే వారికి టికెట్‌ అవసరం లేదు.. ఎలాంటి భయంలేని ఉచిత ప్రయాణం..!
Bhakra Nangal Train
Follow us on

ఫ్రీ అనే పదం వినగానే చాలా మందికి కళ్లు పెద్దవుతాయి. ఇక అలాంటిది రైలులో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందని చెబితే… చాలామంది నమ్మరు. కానీ ఇది పూర్తిగా నిజం. అది మరెక్కడో అనుకోవద్దు.. ఎందుకంటే.. మనదేశంలోనే.. సాధారణంగా అందరికీ తెలిసి భారతదేశంలో రైళ్లలో ప్రయాణించడానికి చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌ని కలిగి ఉండటం తప్పనిసరి. టికెట్ లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరం. టికెట్ లేని రైలు ప్రయాణం చట్టవిరుద్ధం. పట్టుబడితే, జరిమానాతో పాటు జైలు వరకు శిక్ష పడుతుంది. దేశంలో టికెట్ కొనాల్సిన అవసరం లేని రైలు నడుస్తోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రైలులో మీ టిక్కెట్‌ను చెఖ్ చేయడానికి ఏ టీటీ, ఎవరూ రారు. స్టేషన్‌లో దిగిన తరువాత కూడా మీ టిక్కెట్‌ను ఎవరూ అడగరు. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో ఒక ప్రత్యేక రైలు నడుస్తోంది. అందులో ప్రయాణించడానికి మీకు టిక్కెట్ అవసరం లేదు. ఈ రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈ రైలులో టిటిఇ ఎవరూ ఉండరు. మీకు టిక్కెట్ బుకింగ్ ఇబ్బంది లేదు. ఎలాంటి టిక్కెట్టు లేకుండా ఉచితంగా ఎన్నిసార్లయినా ఈ రైలులో ప్రయాణించవచ్చు. ఈ ప్రత్యేక రైలులో ప్రయాణించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు, పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ విశేషమేమిటంటే గత 75 ఏళ్లుగా ఈ రైలు ప్రజలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది.

పాండబ్- హిమాచల్ ప్రదేశ్ మధ్య నడుస్తున్న ఈ రైలు పేరు భాక్రా-నంగల్ రైలు. భక్రా-నంగల్ రైలులో ప్రయాణించడానికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రైలులో ఎవరూ ఎలాంటి భయం లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. ఈ రైలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 13 కి.మీ ప్రయాణిస్తుంది. భాక్రా-నంగల్ డ్యామ్‌పై నడిచే ఈ రైలులో ప్రయాణించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దులో నిర్మించిన భాక్రా-నంగల్ డ్యామ్ చూడటానికి ప్రజలు ఈ రైలులో ప్రయాణిస్తారు. ఈ రైలు సట్లెజ్ నది, శివాలిక్ కొండల గుండా వెళుతుంది. ఇక్కడి సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ రైల్లో ప్రయాణిస్తుంటారు. అనేక బాలీవుడ్‌ సినిమా షుటింగ్‌లు కూడా జరిగాయి. మార్గంలో ఈ రైలు మూడు సొరంగాలు, ఆరు స్టేషన్ల గుండా వెళుతుంది. డీజిల్‌తో నడిచే ఈ రైలు కోచ్‌లు చెక్కతో తయారు చేశారు. 3 కోచ్‌లతో కూడిన ఈ రైలును తొలిసారిగా 1948లో నడిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ రైలు ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది. నేటికీ ఈ రైలులో రోజుకు 800 మంది ప్రయాణిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..