Operation Kaveri: యుద్ధ భూమిలో చిక్కుకున్న ఇండియన్స్.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భారత ప్రభుత్వం..

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కిరప్పించేందుకు ‘ఆపరేషన్‌ కావేరి’ పేరుతో రక్షణ చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. 500 మందిని తీసుకొచ్చేందుకు భారత నౌకలు, విమానాలను సిద్ధం చేసినట్టు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.

Operation Kaveri: యుద్ధ భూమిలో చిక్కుకున్న ఇండియన్స్.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భారత ప్రభుత్వం..
Operation Kaveri

Updated on: Apr 25, 2023 | 6:19 AM

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కిరప్పించేందుకు ‘ఆపరేషన్‌ కావేరి’ పేరుతో రక్షణ చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. 500 మందిని తీసుకొచ్చేందుకు భారత నౌకలు, విమానాలను సిద్ధం చేసినట్టు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.

సూడాన్‌ అంతర్గత ఆధిపత్యపోరుతో సూడాన్‌లో చెలరేగిన హింస సూడాన్‌లోని భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. సూడాన్‌లో చిక్కుకుపోయిన వందలాది మందిని సురక్షితంగా భారత్‌కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి ఆపరేషన్‌ కావేరి అని పేరుపెట్టింది.

సూడాన్‌లో చిక్కుకుపోయిన 500 మంది భారతీయులు సూడాన్‌ పోర్ట్‌కి చేరుకున్నట్టు భారత విదేశాంగా శాఖా మంత్రి జైశంకర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేశారు. ఆపరేషన్‌ కావేరి ద్వారా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భారత్‌కి రప్పించే ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. వారిని భారత్‌కి చేర్చేందుకు ఇండియన్‌ షిప్స్‌, విమానాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. మనదేశానికి చెందిన నౌకలను, రెండు C-130J విమానాలను భారత్‌ అందుబాటులో ఉంచింది.

సూడాన్‌ ఆర్మీకీ, సూడాన్‌ పారా మిలిటరీ దళాలకీ మధ్య జరిగిన ఘర్షణలు హింసకు దారితీశాయి. బాంబుల మోతతో ఖార్తోమ్‌ దద్దరిల్లుతోంది. దీంతో ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్‌ కావేరి పేరుతో భారతీయులను వెనక్కిరప్పించేందుకు సింసిద్ధమైంది. సూడాన్‌లో కనీసం 420 మంది పౌరులు మరణించారనీ, 3,700 మంది తీవ్రంగా గాయపడ్డట్టు సూడాన్‌ హెల్త్‌మినిస్ట్రీ వ్యాఖ్యలను వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ WHO రీట్వీట్‌ చేసింది.

మరోవైపు సూడాన్ యుద్ధభూమిలో చిక్కుకున్న విదేశీయులను తరలిస్తోంది ఫ్రాన్స్‌ ప్రభుత్వం. తమ దేశస్తులతో పాటు 27 ఇతర దేశాల వారిని సైతం తరలించింది ఫ్రాన్స్. వీరిలో భారతీయులు కూడా ఉన్నట్టు ఫ్రెంచ్ ఎంబసీ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..