కుల్‌భూషణ్‌ను కలిసేందుకు ఇవాళ రావొచ్చు : పాక్

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2019 | 3:48 PM

కుల్‌భూషరణ్ వ్యవహారంలో పాక్ వెనక్కి తగ్గింది. పాకిస్థాన్‌ జైల్లో ఉన్న భారత జాతీయుడు కుల్‌భూషణ్‌ జాదవ్‌కు దౌత్యసాయం అందేలా చేస్తామని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. భారత నౌకాదళంలో పదవీ విరమణ చేసిన జాదవ్‌ గూఢచర్యం, ఉగ్రవాదాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పాకిస్థాన్‌ నిర్బంధించింది. అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో భారత్ అధికారులకు ఆయనను చూసేందుకు అనుమతించారు. అయితే ఈ విషయంలో భారత్ ఆచూతూచి వ్యవహరిస్తోంది. ఇవాళ కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత అధికారులు రావొచ్చని […]

కుల్‌భూషణ్‌ను కలిసేందుకు ఇవాళ రావొచ్చు : పాక్
Follow us on

కుల్‌భూషరణ్ వ్యవహారంలో పాక్ వెనక్కి తగ్గింది. పాకిస్థాన్‌ జైల్లో ఉన్న భారత జాతీయుడు కుల్‌భూషణ్‌ జాదవ్‌కు దౌత్యసాయం అందేలా చేస్తామని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. భారత నౌకాదళంలో పదవీ విరమణ చేసిన జాదవ్‌ గూఢచర్యం, ఉగ్రవాదాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పాకిస్థాన్‌ నిర్బంధించింది. అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో భారత్ అధికారులకు ఆయనను చూసేందుకు అనుమతించారు. అయితే ఈ విషయంలో భారత్ ఆచూతూచి వ్యవహరిస్తోంది. ఇవాళ కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత అధికారులు రావొచ్చని పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. గూఢచర్యం ఆరోపణలపై కుల్‌భూషణ్‌కు పాక్ మరణశిక్ష విధించింది, అయతే అంతర్జాతీయ న్యాయస్థానం దీనిపై స్టే విధించింది. పాక్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత్‌కు కాన్సులర్ అనుమతిని పాక్ ఇవ్వకపోవడంపై ఐసీజే మండిపడింది. దీంతో పాక్ మెత్తబడింది.