దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఒక రోజు తగ్గితే, మరో రోజు కేసులు పెరుగుతున్నాయి. బహుశా టెస్టుల సంఖ్యలో వ్యత్యాసం వల్ల ఈ గణాంకాలు నమోదవుతూ ఉండవచ్చు. బుధవారం కొత్తగా 35,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 95,34,964కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,22,943 యాక్టీవ్ కేసులున్నాయి. బుధవారం మరో 526 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,38,648కు చేరింది. బుధవారం 11,11,698 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం టెస్టుల సంఖ్య 14,35,57,647 కు చేరింది. రోజురోజుకూ యాక్టీవ్ కేసులు తగ్గడం, రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశాలు
నెల రోజుల వ్యవధిలో (నవంబర్ రెండు నుంచి డిసెంబర్ రెండు వరకు) కరోనా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లిస్ట్‌ను మంత్రిత్వ శాఖ గ్రాఫ్ రూపంలో వివరిస్తూ, ట్వీట్ చేసింది. ఆ లిస్ట్‌లో కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, గోవా, త్రిపుర ఉన్నాయి.
Also Read :
నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్
మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !
ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి