
బంగ్లాదేశ్ రగిలిపోతోంది. ఎందుకని? అక్కడి యువనేత ఉస్మాన్ హాదీని ‘గుర్తు తెలియని వ్యక్తులు’ చంపేశారు. ఈ ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అనే టాపిక్ మీద కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకోవాలిక్కడ. అబు కతల్ అని ఓ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉండేవాడు పాకిస్తాన్‌లో. ఆ ఉగ్రవాది దరిదాపుల్లోకి ఎవరు వెళ్లాలన్నా.. పాక్ ఆర్మీని దాటుకుని వెళ్లాలి. అలాంటిది.. అబు కతల్‌ను ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఫట్‌మని కాల్చి చంపేశారు. 2024లో వైష్ణోదేవి భక్తులపై కాల్పులు జరిపారు. ఆ దాడి వెనక ఉన్నది అమీర్ హంజా. పాక్ ఆర్మీలో మాజీ డైరెక్టర్ జనరల్. అమీర్ హంజాకు సెక్యూరిటీ ఏ లెవెల్‌లో ఉంటుంది. బట్.. నల్లని దుస్తులు ధరించిన ‘గుర్తు తెలియని వ్యక్తులు’ పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు. అమీర్ సర్ఫరాజ్ అని.. లష్కరే తోయిబా ఫౌండర్‌కు సన్నిహితుడు. భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌ను పాక్ జైల్లో చంపించింది. అంతటి మాఫియా డాన్‌ను.. లాహోర్‌లో ఇద్దరు ‘గుర్తు తెలియని వ్యక్తులు’ బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మందిని ఎవరూ ఊహించని రీతిలో హతమార్చారు. చంపినోళ్లందరూ ‘గుర్తు తెలియని వ్యక్తులే’. వాడు లష్కరే తోయిబా ఉగ్రవాదా, జైషే మహ్మద్ టెర్రరిస్టా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఆటంకవాదా? లేదా పాక్ ఆర్మీ కనుసన్నల్లో ఉన్న మోస్ట్ వాంటెడా..? అక్కడున్నది ఎవరైనా గానీ బుల్లెట్లు దింపుతున్నారంతే. ఇలాంటి ఆపరేషన్స్‌తో పాక్‌లో 26 మంది...