West Bengal: అమ్మో బామ్మ.. 110 ఏళ్ల వయసులో కొత్త దంతాలు, జుట్టు.. ఘనంగా రీబర్త్ సెలబ్రేషన్స్..

సాధారణంగానే 60 ఏళ్ల వయసు దాటిన తరువాత జుట్టు రాలిపోవడం, పళ్లు ఊడిపోవడం వంటివి జరుగుతుంటాయి. మరి 110 ఏళ్ల వయసులో కొత్త పళ్లు రావడం, జుట్టు రావడం ఎప్పుడైనా విన్నారా?

West Bengal: అమ్మో బామ్మ.. 110 ఏళ్ల వయసులో కొత్త దంతాలు, జుట్టు.. ఘనంగా రీబర్త్ సెలబ్రేషన్స్..
Old Woman

Updated on: Feb 10, 2023 | 8:42 AM

సాధారణంగానే 60 ఏళ్ల వయసు దాటిన తరువాత జుట్టు రాలిపోవడం, పళ్లు ఊడిపోవడం వంటివి జరుగుతుంటాయి. మరి 110 ఏళ్ల వయసులో కొత్త పళ్లు రావడం, జుట్టు రావడం ఎప్పుడైనా విన్నారా? వినడం కాదు, ఇప్పుడు ఏకంగా చూసేయండి. అవును, ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సఖిబాలా మోండల్‌కు 110 ఏళ్ల వయసులో కొత్త జుట్టు, దంతాలు వచ్చాయి. అది చూసి ఆశ్చర్యపోవడం స్థానికుల వంతు అయ్యింది. ఆమెకు అలా రావడంతో.. అందరూ పునర్జన్మ అంటూ సంబరాలు జరిపారు. స్థానిక నేతలను ఆహ్వానించి మరీ ఈ రీబర్త్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సఖిబాలా మోండల్ వయసు 110 ఏళ్లు. తన కుమార్తె, మనవళ్లు, మనవరాళ్ల మధ్య రీబర్త్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. కేక్ కట్ చేసి, అందరికీ విందు ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఇది పునర్జనకు సంకేతంగా పేర్కొంటున్నారు.

కాగా, 110 ఏళ్ల వయసులో కొత్త దంతాలు రావడంపై సీనియర్ డెంటిస్ట్ శ్యామల్ సేన్ స్పందించారు. ‘ఈ రకమైన ఘటన చాలా అరుదు. కానీ, అసాధ్యం కాదు. ఒక సంవత్సరం క్రితం కూడా ఘటల్ వద్ద 100 ఏళ్ల వృద్ధురాలికి కొత్త దంతాలు వచ్చాయి. కొత్త వెంట్రుకలు, దంతాలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అయితే, వృద్దాప్యంలో ఒక వ్యక్తి కొత్త దంతాలు పెరగడానికి శరీరానికి అవసరమైన గరిష్ట కాల్షియం, ఇతర ఖనిజాలు కోల్పోతారు. అందుకే.. వృద్ధాప్యంలో కొత్త దంతాలు, కేశాలు రావు. కానీ, సఖిబాలా మోండల్ కేసు చాలా అరుదైనది.’ అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..