Love Story: కొడుకు చేసిన పనికి దారుణ హత్యకు గురైన తల్లి.. ఇంతకీ అతనేం చేశాడంటే..

|

Jan 30, 2022 | 3:29 PM

Love Story: పక్కింటి అమ్మాయిని ప్రేమించిన ఓ యువకుడు.. ఆ అమ్మాయిని తీసుకుని పారిపోగా.. యువతి కుటుంబ సభ్యులు..

Love Story: కొడుకు చేసిన పనికి దారుణ హత్యకు గురైన తల్లి.. ఇంతకీ అతనేం చేశాడంటే..
Follow us on

Love Story: పక్కింటి అమ్మాయిని ప్రేమించిన(Love) ఓ యువకుడు.. ఆ అమ్మాయిని తీసుకుని పారిపోగా.. యువతి కుటుంబ సభ్యులు(Family) ఆ యువకుడి తల్లిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బరేలీలో వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బారువా ప్రాంతంలో బాధితురాలు చమేలీ కశ్యప్, ఆమె భర్త, కుమారుడు నివాసం ఉంటున్నారు. అయితే, బాధితురాలి కుమారుడు తమ ఇంటి పక్కనే నివాసం ఉండే మరో అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమికులిద్దరూ.. ఇంటి నుంచి పారిపోయారు. అది తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు.. యువకుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఈ దాడి విషయాన్ని గ్రహించిన యువకుడి తల్లిదండ్రులు గ్రామం నుంచి పారిపోయారు. కొంతకాలం పాటు ఇతర ప్రాంతంలో తలదాచుకున్నారు.

అయితే, తాజాగా అంతా సర్దుకుందని భావించి తిరిగి గ్రామానికి వచ్చారు. కానీ, యువతి కుటుంబ సభ్యుల్లో ఇంకా పగ రగులుతూనే ఉంది. తమకు ఇష్టం లేకుండా తమ కూతురిని పెళ్లి చేసుకున్న యువకుడి కుటుంబాన్ని అంతమొందించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. యువకుడి తల్లి తాజాగా మార్కెట్‌కు వెళ్తుండగా అదును చూసి దాడి చేశారు. కర్రలతో చావబాదారు. కొడవళ్లతో విచక్షణారహితంగా నరికారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆమె భర్త, స్థానిక ప్రజలు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఫరీద్‌పూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 304 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజ్ కుమార్ వెల్లడించారు. నిందితుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోన పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

Also read:

PM Modi-Vaccine: దేశంలో 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ పూర్తి..శభాస్ ఇండియా అంటూ ప్రధాని ట్వీట్..

Viral Photos: 2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు..?

Virat Kohli: విరాట్ కోహ్లీ అసాధారణ కెప్టెన్.. జో రూట్ మాత్రం అలా కాదు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడి వ్యాఖ్యలు..