Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమేథీలో ఓ వ్యక్తి విలాసవంతమైన కారులో మేకల దొంగతనానికి పాల్పడ్డాడు. రాత్రి చీకటిలో దొంగలు కారును కొంత దూరంలో నిలిపారు. అనంతరం మేకను ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. కారులోంచి మేకలను దొంగిలించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన జైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరానా ప్రాంతంలో చోటు చేసుకుంది. జహాన్ నివాసి మహ్ఫూజ్ అహ్మద్ తన ఇంటి సమీపంలో పడుకున్నాడు. మేకను కూడా అక్కడే కట్టేశారు. రాత్రి 2 గంటల సమయంలో తెల్లటి కారు వచ్చి కొంత దూరంలో పార్క్ చేసింది. అందులోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. మెల్లగా కట్టేసిన మేకను ఎత్తుకెళ్లి కారులోకి ఎక్కించాడు.
రాత్రి కావడంతో అంతా పడుకున్నారు. ఉదయం ఇంటి యజమానా లేచి చూశాక ఇంటి ముందు కట్టేసిన మేక కనిపింలేదు. దాంతో షాక్ అయిన ఇంటి యజమాని.. మేక కోసం తీవ్రంగా గాలించాడు. చుట్టుపక్కన అంతా వెతికాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఇంటి దగ్గర అమర్చిన సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో షాకింగ్ సీన్ కనిపించింది. కొందరు దుండగులు.. కారులో వచ్చి మేకలు ఎత్తుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.
ఇంతకు ముందు, రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌గంజ్ పట్టణంలో లగ్జరీ కారులో వచ్చిన దొంగలు ఉప్పు బస్తాను దొంగిలించారు. అర్థరాత్రి వేళ కారులో వచ్చిన కేటుగాళ్లు.. కారులో ఐదు ఉప్పు బస్తాలు వేసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వైరల్‌గా మారింది. ఈ చోరీ ఘటనపై పోలీసులపై విచారణ చేపట్టారు. ఉప్పు దొంగలను పోలీసులు ఇంకా కనిపెట్టేదు.
ఈ విషయమై అమేథీ ఎస్పీ డాక్టర్ ఇలమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ కార్ రైడర్ మేకను దొంగిలించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. నిందితలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..