Love: ఏమైందో ఏమో.. ఓ యువతి(22) ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ ఎందుకు చనిపోయిందో తెలియక బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్ని కేసుల మాదారిగానే ఈ ఘటనపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా చేసుకుందని భావించారు గానీ.. చివరి క్షణంలో ఆమె ఫోన్ నుంచి వెళ్లిన ఒక వాయిస్ మెసేజ్ మొత్తం కేసును మలుపు తిప్పింది. యువతి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని పట్టించింది. వాయిస్ మెసేజ్ ఆధారంగా పోలీసులు ఏం చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బిహార్ రాష్ట్రం సుపాల్ జిల్లాలోని రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కూతురు గదిలో నిద్రిస్తోందని భావించామన్నారు. అయితే, కూతురుని లేపేందుకు ఆ తండ్రి పలుమార్లు పిలిచాడు. అయినప్పటికీ ఎంతకీ తలుపులు తీయలేదు. ఉలుకూ లేదు పలుకూ లేదు. దాంతో తలుపులు పగలగొట్టి గదిలో వెళ్లగా.. గుండె ముక్కలయ్యే దృశ్యం కనిపించింది. యువతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే విషయాన్ని చుట్టుపక్కన వారికి తెలియజేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఉరికి వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి.. పరిశీలించారు. ఎందుకు చనిపోయిందో అర్థం కాక.. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న యువతి వద్ద మొబైల్ లభ్యం అవగా.. ఆ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్, మెసేజెస్ అన్నీ పరిశీలించారు పోలీసులు. అప్పుడే అసలైన ట్విస్ట్ వచ్చింది. యువతి ఆత్మహత్యకు ప్రేమే కారణం అని తేల్చారు. చనిపోయే ముందు యువతి తన ప్రియుడికి వీడియో కాల్ చేసింది. అలాగే ‘నా చావుకు నువ్వే కారణం’ అంటూ అతనికి వాయిస్ మెసేజ్ కూడా పెట్టింది. దీనిని గుర్తించిన పోలీసులు.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..