Uddhav Thackeray: దేశంలోని పలు రాష్ట్రాల్లో తౌక్టే తుఫాను అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తుఫాను పర్యటనలపై మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. కొంకణ్ ప్రాంతంలో తౌక్టే తుఫాను నష్టం పరిశీలనకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొన్ని గంటలే కేటాయించారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వేను విమర్శించారు.
బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు సరే.. తాను నాలుగు గంటలైనా క్షేత్ర స్థాయిలో పర్యటించా… ప్రజల దగ్గరికి వెళ్లి వారి పరిస్థితులను చూశా… తానేమీ హెలికాప్టర్‌లో ఉంటూ ఫొటో సెషన్ నిర్వహించలేదంటూ కౌంటర్ ఇచ్చారు. తాను స్వతహాగా ఫొటోగ్రాఫర్‌నని.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి తాను ప్రజల దగ్గరికి రాలేదంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటు కౌంటర్ ఇచ్చారు.
తౌక్టే తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా కొంకణ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ విమర్శలు గుప్పించారు. కేవలం మూడు గంటల్లోనే తౌక్టే ఇబ్బందులను సీఎం ఉద్ధవ్ ఎలా అవగాహన చేసుకున్నారంటూ మాజీ సీఎం ఫడ్నవిస్ విమర్శలు చేయగా.. సీఎం ఉద్ధవ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: