IIT Madras Placements: క్యాంపస్‌ ప్లేస్‌మెట్లలో ఐఐటీ మద్రాస్‌ విద్యార్ధి సత్తా.. ఏకంగా రూ.4.3 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌

2024-25 విద్యా సంవత్సరానికి ఐఐటీ మద్రాస్ లో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెట్లలో అక్కడి విద్యార్ధులు సత్తా చాటారు. అధిక ప్యాకేజీలతో పలువురు విద్యార్ధులు కొలువులు దక్కించుకున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఏకంగా రూ.4 కోట్ల వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్ కొట్టేశాడు..

IIT Madras Placements: క్యాంపస్‌ ప్లేస్‌మెట్లలో ఐఐటీ మద్రాస్‌ విద్యార్ధి సత్తా.. ఏకంగా రూ.4.3 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌
IIT Madras Placements

Updated on: Dec 03, 2024 | 1:08 PM

చెన్నై, డిసెంబర్‌ 3: దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో 2024-25 అకడమిక్ విద్యాసంవత్సరానికి ప్లేస్‌మెంట్స్ ప్రారంభమయ్యాయి. ఐఐటీల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను రిక్రూట్‌ చేసుకునేందుకు టాప్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్లేస్‌మెంట్ సీజన్‌లో మరోమారు సత్తా చాటింది. ఇక్కడ చదువుతన్న వందలాది మంది విద్యార్ధులు కళ్లు చెదిరే ప్యాకేజీలతో జాబ్‌ ఆఫర్లు సొంతం చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఏకంగా రూ.4 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. బేస్‌, ఫిక్స్‌డ్‌ బోనస్‌, రీలొకేషన్‌ వంటి వాటితో కలిసి మొత్తం రూ.4.3 కోట్లకుపైగా ప్యాకేజీతో జేన్ స్ట్రీట్ క్యాపిల్ అనే ట్రేడింగ్‌ సంస్థ సదరు విద్యార్ధికి జాబ్‌ ఆఫర్ చేసింది. అయితే అతడు హాంకాంగ్‌లో క్వాటిటేటివ్‌ ట్రేడర్‌గా శిక్షణ పొందిన తర్వాత జేన్ స్ట్రీట్‌లో ఉద్యోగం పొందాల్సి ఉంటుంది.

బ్లాక్‌రాక్, గ్లీన్, డా విన్సీ, మైక్రోసాఫ్ట్‌తో సహా పలు అగ్ర కంపెనీలు ఈ ఏడాది IIT మద్రాస్ విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందించేందుకు ముందుకొచ్చాయి. కాగా ఐఐటీ ఢిల్లీ, బాంబే, మద్రాస్‌, కాన్పూర్‌, రూర్కీ, ఖరగ్‌పూర్‌, గౌహతి, బీహెచ్‌యూలలో నియామకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీ ప్యాకేజీలను టెకీలకు కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి.

అధిక ప్యాకేజీలు ఆఫర్‌ చేసిన కంపెనీలు ఇవే..

రూ.2 కోట్ల కంటే ఎక్కువ ప్యాకీజే ఆఫర్‌ చేస్తున్న కంపెనీ బ్లాక్‌రాక్‌, గ్లీన్‌ అండ్‌ డావిన్సీ, ఏపీటీ పోర్ట్‌ఫోలియో అండ్‌ రూబ్రిక్‌ కంపెనీ రూ.1.4 కోట్లకుపైగా ప్యాకేజీ, డేటాబ్రిక్స్‌, ఎబుల్లియెంట్‌ సెక్యూరిటీస్‌, ఐఎంసీ ట్రేడింగ్‌ కంపెనీలు రూ.1.3 కోట్లకు పైగా, క్వాడే రూ.1 కోటి, క్వాంట్‌బాక్స్‌ అండ్‌ గ్రావిటన్‌ కంపెనీ రూ.90 లక్షలు, డీఈ షా కంపెనీ రూ.66 లక్షల నుంచి 70 లక్షల వరకు, పేస్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ రూ.75 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఇలా కనిష్టంగా రూ.40 లక్షల వరకు వార్షిక ప్యాకేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. మొత్తంగా ఈ ఏడాది టెకీలకు బాగానే కలిసొచ్చినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us