Watch Video: మేఘాలయలో వింత గ్రామం.. అక్కడ అందరూ విజిల్ భాష‌లోనే మాట్లాడుకుంటారు..

| Edited By: Janardhan Veluru

Feb 23, 2023 | 5:48 PM

మేఘాలయ...భూతలంపై ఉన్న స్వర్గం. పచ్చనిలోయలు, అడవుల గుండా ప్రవహించే నదులు. కొండలపై జాలువారుతున్న జలపాతాలు. ప్రకృతి సోయగాలు. ఒక్కసారి వెళ్తే పదే పదే వెళ్లానిపించే సుందర రాష్ట్రం.

Watch Video: మేఘాలయలో వింత గ్రామం.. అక్కడ అందరూ విజిల్ భాష‌లోనే మాట్లాడుకుంటారు..
Whistling Village
Follow us on

మేఘాలయ…భూతలంపై ఉన్న స్వర్గం. పచ్చని లోయలు, అడవుల గుండా ప్రవహించే నదులు. కొండలపై జాలువారుతున్న జలపాతాలు. ప్రకృతి సోయగాలు. ఒక్కసారి వెళ్తే పదే పదే వెళ్లానిపించే సుందర రాష్ట్రం. ఈ సమ్మర్‎లో మీరు టూర్ ప్లాన్ చేస్తుంటే..మేఘాలయాకు వెళ్లండి. అక్కడి అందమైన ప్రదేశాల్లో కాంగ్ థాంగ్ గ్రామం ఒక్కటి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో 700మందికి పైగా జనాభా ఉంటారు. ఈ గ్రామం తూర్పు ఖాసి హీల్స్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

ఇప్పటివరకు మనం ఎన్నో గ్రామాల గురించి విన్నాం. అక్కడ ఉండే వింత ఆచారాలు లేదా విచిత్రమైన వాతావరణం గురించి తెలుసుకున్నాం. కానీ ఈ కాంగ్ థాంగ్ గ్రామం లాంటి విచిత్రమైన గ్రామం గురించి ఎప్పుడూ విని ఉండే ఛాన్సే లేదు. ఈ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామం అవార్డును కూడా గెలుచుకుంది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే…మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి 60కిలో మీటర్ల దూరంలో కాంగ్‎థాంగ్ గ్రామం ఉంది. వీరికి పదాలను ఉపయోగించే భాష లేదు. అందుకే దీనిని విజిల్ విలేజ్ అని పిలుస్తారు. ఇక్కడి గ్రామస్థులు తమ తోటివారిని పేర్ల పెట్టి పిలవరు. ఒక రాగంతో పిలుస్తారు. అదే ఈ గ్రామం ప్రత్యేకత. తాము చెప్పాలనుకున్న సందేశాలను ఈలల ద్వారా చెబుతుంటారు. అయితే ఇక్కడ ఉండే గ్రామస్థులకు రెండు పేర్లు ఉంటాయి. ఒకటి సాధారణ పేరు కాగా మరొకటి పాట పేరు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఆ గ్రామంలో 700మంది ఉన్నారు. అందరికీ విభిన్న రాగాలతో ట్యూన్స్ ఉన్నాయి. ఆ గ్రామ వాసి ఫివ్ స్టార్ ఖోంగ్ సిట్ మాట్లాడుతూ..ఒక వ్యక్తిని పిలించేందుకు ఉపయోగించే ట్యూన్ ని వారి తల్లులే కంపోజ్ చేస్తారట. అక్కడ గ్రామస్తుడు మరణిస్తే అతనితోపాటు అతన్ని పిలిచే ట్యూన్ కూడా మరణిస్తుందట. అక్కడ ప్రతి ఒక్కో గ్రామాస్థుడిని ఒక్కో రాగంతో పిలుచుకుంటారు.

ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తుందని చెప్పారు స్థానికులు. గతేడాది పర్యటక మంత్రిత్వశాఖ కాంగ్ థాంగ్ ఉత్తమ పర్యటక గ్రామంగా ప్రపంచ టూరిజం ఆర్గనేజేషన్ ఎంపిక చేసింది.

మీరు ఈ శాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ విస్లింగ్ గ్రామాన్ని మాత్రం అస్సలు మిస్సవ్వకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి