దీపక్ కొచార్ కి కరోనా వైరస్ పాజిటివ్, క్వారంటైన్ లో ‘ఈడీ’ !

| Edited By: Anil kumar poka

Sep 14, 2020 | 4:54 PM

ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న దీపక్ కొచార్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో ఈడీ సిబ్బంది అంతా తమకు తాము క్వారంటైన్ లోకి వెళ్లారు.

దీపక్ కొచార్ కి కరోనా వైరస్ పాజిటివ్, క్వారంటైన్ లో ఈడీ !
Follow us on

ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న దీపక్ కొచార్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో ఈడీ సిబ్బంది అంతా తమకు తాము క్వారంటైన్ లోకి వెళ్లారు. వారితో బాటే దీపక్ లాయర్ కూడా ! మనీలాండరింగ్ కేసును విచారించే ప్రత్యేక కోర్టు దీపక్ కొచార్ ను ఈ నెల 19 వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈఓ చందా కొచార్ భర్త అయిన దీపక్ కొచార్ ను ఈ నెల 7 న అరెస్టు చేశారు. వీడియోకాన్ గ్రూపునకు, తన ఆధ్వర్యంలోని నూపవర్ రెనివబుల్ సంస్థకు మధ్య నడిచిన పలు ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు దీపక్ సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఈ సంస్థ 2010 లో వీడియోకాన్ గ్రూపు నుంచి 64 కోట్లను, మాట్రిక్స్ ఫెర్టిలైజర్స్ నుంచి 325 కోట్లను పెట్టుబడులుగా అందుకుంది. ‘చందా గారు’ ఐ సీ ఐ సీ ఐ బ్యాంకు ప్రధాన అధికారిగా ఉండగా ఈ సంస్థలకు బ్యాంకు రుణాలు ఇచ్ఛేముందు ఇవన్నీ జరిగాయి. ఈ యవ్వారం ‘నీకది..నాకది’ ప్రతిఫలం కింద సాగింది. ముడుపులు, అవకతవకలు షరా మామూలే ! దీంతో ఈడీ రంగంలోకి దిగి చందా గారి 80 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేయడం, పనిలో పనిగా ఆమె భర్తను అరెస్టు చేయడం కూడా జరిగింది.