IBPS CRP Clerk Jobs: దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో 4,045 క్లర్క్‌ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్స్

|

Jul 02, 2023 | 9:23 PM

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) 2024-25 సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్‌పీ)-XIII నోటిఫికేష‌న్ విడుదల..

IBPS CRP Clerk Jobs: దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో 4,045 క్లర్క్‌ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్స్
IBPS CRP Clerk
Follow us on

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) 2024-25 సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్‌పీ)-XIII నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4,045 క్లర్క్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఉద్యోగాలు కల్పిస్తారు.

ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 2, 1995 నుంచి జులై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జులై 21, 2023 చివరి తేదీ. జనరల్‌ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.175 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఉంటుంది. మెయిన్స్‌ అక్టోబర్‌లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు గంట సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులే, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెయిన్స్‌ పరీక్ష 190 ప్రశ్నలకు 200 మార్కులకు 2 గంటల్లో పరీక్ష జరుగుతుంది.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.