PM Narendra Modi TV9 Interview: నమ్మకం విశ్వాసంగా.. విశ్వాసం గ్యారెంటీగా మారింది.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిపోయిందని, 2024 వచ్చేసరికి ఆ విశ్వాసం గ్యారెంటీగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పదేళ్ల పాలనా అనుభవంతో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందని టీవీ9 నెట్‌వర్క్‌ ఫైవ్‌ ఎడిటర్స్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు.

PM Narendra Modi TV9 Interview: నమ్మకం విశ్వాసంగా.. విశ్వాసం గ్యారెంటీగా మారింది.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Pm Modi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 03, 2024 | 7:19 AM

2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిపోయిందని, 2024 వచ్చేసరికి ఆ విశ్వాసం గ్యారెంటీగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పదేళ్ల పాలనా అనుభవంతో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందని టీవీ9 నెట్‌వర్క్‌ ఫైవ్‌ ఎడిటర్స్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు. గ్యారెంటీలు ఇవ్వాలంటే పెద్ద తపస్సు చేయాలని, మాట్లాడిన ప్రతీ మాట గ్యారెంటీగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజల కోసం తాను కష్టపడుతున్నానంటే వారు నమ్మారని అన్నారు. చెప్పింది తాను చేసి చూపిస్తానని తాను గాలి మాటలు చెప్పనని, మోదీ తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలతోపాటు.. రామమందిరం రాజ్యాంగంలోని పలు అంశాలపై మాట్లాడారు.

టీవీ-9 నెట్‌వర్క్‌కు చెందిన 5 మంది ఎడిటర్లతో మోడీ మాట్లాడుతూ.. ప్రజలు తనపై చాలా అంచనాలు పెట్టుకున్నారన్నారు. పాత ఎన్నికలను నెమరువేసుకుంటూ మోదీ కాస్త ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ తనకు ఎన్నికలు కొత్త కాదన్నారు. 2014లో మనం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజల మదిలో అనేక ప్రశ్నలు ఉన్నాయన్నారు. కానీ, మోదీ ఏదో చేస్తారనే ఆశ ప్రజల్లో నెలకొందన్నారు. ఇది 2024లో గ్యారంటీ అవుతుందని నొక్కిచెప్పారు. ఇక్కడితో ఆగకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ.. “2014లో సేవ చేసే అవకాశం వచ్చిందని.. 2019లో రిపోర్ట్ కార్డ్ తీసుకున్నాను.. నేను 2024లో ఆ నిరీక్షణను నెరవేర్చుకోవాలన్నారు. దీన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి.. అంటూ పేర్కొన్నారు.

మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే నాడు మత ఆధారిత రిజర్వేషన్లు వద్దనే నిర్ణయం తీసుకున్నారని మోదీ అన్నారు. కర్ణాటకలో రాత్రికిరాత్రే ముస్లింలను ఓబీసీలోకి చేర్చారని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?
బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?
సిట్రియోన్ సీ-3 కారుపై అద్భుత ఆఫర్.. కేవలం రూ.7 లక్షలకే మీ సొంతం
సిట్రియోన్ సీ-3 కారుపై అద్భుత ఆఫర్.. కేవలం రూ.7 లక్షలకే మీ సొంతం
టాప్ గేర్లో విడా వీ1 ప్రో అమ్మకాలు.. ఈ స్కూటర్లో ప్రత్యేకతలివే..
టాప్ గేర్లో విడా వీ1 ప్రో అమ్మకాలు.. ఈ స్కూటర్లో ప్రత్యేకతలివే..
చేపలతో డ్రింక్.. బతికి ఉండగానే తాగాలంట.. ధర తెలిస్తే షాక్
చేపలతో డ్రింక్.. బతికి ఉండగానే తాగాలంట.. ధర తెలిస్తే షాక్
ఎల్ఐసీ నుంచి మరో అద్భుత స్కీమ్..ఆ ప్లాన్‌తో పింఛన్‌దారులకు పండగే
ఎల్ఐసీ నుంచి మరో అద్భుత స్కీమ్..ఆ ప్లాన్‌తో పింఛన్‌దారులకు పండగే
వీధి కుక్కపై యువకుల పైశాచికం.. ఏం చేసారో మీరే చూడండి...!!
వీధి కుక్కపై యువకుల పైశాచికం.. ఏం చేసారో మీరే చూడండి...!!
ఆ ఫ్యాన్స్‌కు బోలెడంత మంది ఫ్యాన్స్..!
ఆ ఫ్యాన్స్‌కు బోలెడంత మంది ఫ్యాన్స్..!
ఆగస్టు నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల
ఆగస్టు నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల