Hyderabad: ఆరోజు దగ్గరలోనే ఉంది.. హైదరాబాద్‌‌కు యూటీ స్టేటస్‌పై అసద్ సంచలన వ్యాఖ్యలు

|

Aug 04, 2023 | 1:49 PM

MP Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. గతంలో హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీగా మార్చే ప్రమాదం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరో కామెంట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌తోపాటు చెన్నై,బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌, లక్నోలను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలను తాను హెచ్చరిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అనడం పెద్ద సంచలనంగా మారింది. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

Hyderabad: ఆరోజు దగ్గరలోనే ఉంది.. హైదరాబాద్‌‌కు యూటీ స్టేటస్‌పై అసద్ సంచలన వ్యాఖ్యలు
Hyderabad Will Become Union
Follow us on

యూనియన్ టెరిటరీగా హైదరాబాద్.. ఇదే అంశంపై మరోసారి చర్చకు తెరలేపారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. గతంలో హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీగా మార్చే ప్రమాదం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరో కామెంట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌తోపాటు చెన్నై,బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌, లక్నోలను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలను తాను హెచ్చరిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అనడం పెద్ద సంచలనంగా మారింది. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కోసం అటల్‌బిహారీ వాజ్‌పేయీ ఈ సభలో బిల్లును ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుత బిల్లు ద్వారా గౌరవసభ హోదాను ఈ ప్రభుత్వం కించపరుస్తోందని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. మీ రాజకీయ పోరాటాన్ని సభ వెలుపల చూసుకోవాలని ఆయన కేజ్రీవాల్‌, కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల థింక్‌ట్యాంక్‌ నుంచే వచ్చారని ఎద్దేవ చేశారు. కేజ్రీవాల్‌ కూడా బీజేపీ ప్రభుత్వ మనిషేనని, బీజేపీ అధికారంలో లేనప్పుడు కేజ్రీవాల్ ఆ స్థానంలో ఉంచాలనుకుంటున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు అసద్.

ఇదిలావుంటే, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లోక్‌సభలో చేసిన కామంట్స్‌.. కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ విభజనతో బీజేపీ విధానం బయటపడిందని.. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు చెన్నై,బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌, లక్నోలను యూటీలుగా మార్చే అవకాశం ఉందని గత ఏడాది కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ విభజన చూసి చప్పట్లు కొడుతున్న సెక్యులర్‌ పార్టీలు.. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు కూడా రెడీగా ఉండాలని హెచ్చరించారు.

జమ్ముకశ్మీర్ విభజనను చూసి సెక్యులర్‌గా చెప్పుకునే పార్టీలు చప్పట్లు కొడుతున్నాయని… కానీ వీరే భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాలను UTలుగా మార్చినపుడు గొడవలు చేస్తారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు భవిష్యత్‌ పరిణామాలకు రెడీగా ఉండాలని ఒవైసీ హెచ్చరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీపై మజ్లిస్ చేసిన ఆరోపణలు వ్యూహాత్మకమా అనే కోణంలోనూ చర్చ జరగుతోంది. అసద్‌ ఆరోపణల్ని బీజేపీ నేతలు తిప్పి కొట్టినా మరోసారి అదే వ్యాక్యలు చేశారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. అప్పుడు ఒవైసీ చేసిన కామెంట్స్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదంతా తప్పుడు ప్రచారం అంటూ ఒవైసీ వ్యాఖ్యల్ని ఖండించారు. హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశంలోని ఏ నగరాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రతిపాదన లేదన్నారాయన.

ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేయాలని ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని ప్రస్తావించారు. భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనకు కొంతమంది కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ప్రపోజల్ పక్కన పడింది. అంతా సవ్యంగా ఉన్న సమయంలో అసదుద్దీన్ కామెంట్స్‌ సంచలం రేపాయి.

హైదరాబాద్‌ లేని తెలంగాణ తలకాయ లేని శరీరం లాంటిదంటోందని గతంలో టీఆర్ఎస్ నేతలు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది గులాబీ దళం. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలనే ప్రపోజల్‌ను కూడా తిరస్కరించారు పార్టీ నేతలు. పది జిల్లాల తెలంగాణే కావాలని పట్టు పట్టు పట్టారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదనకు తాము మొదటి నుంచి వ్యతిరేకం అంటున్నారు పార్టీ నేతలు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించిన సంగతి తెలిసిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం