జమ్ముకశ్మీర్‌లో అమిత్‌ షా సుడిగాలి పర్యటన.. బార్డర్ బీఎస్‌ఎఫ్‌ పోస్ట్‌ల పరిశీలన

జమ్ము కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్వయంగా సమీక్ష నిర్వహించారు. కథువాలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో మాట్లాడారు. బుధవారం(ఏప్రిల్ 9) శ్రీనగర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను అమిత్ షా ప్రారంభిస్తారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అమిత్‌షాకు జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఘనస్వాగతం పలికారు.

జమ్ముకశ్మీర్‌లో అమిత్‌ షా సుడిగాలి పర్యటన.. బార్డర్ బీఎస్‌ఎఫ్‌ పోస్ట్‌ల పరిశీలన
Amit Shah In Kathua

Updated on: Apr 07, 2025 | 8:53 PM

జమ్ము కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్వయంగా సమీక్ష నిర్వహించారు. కథువాలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో మాట్లాడారు. బుధవారం(ఏప్రిల్ 9) శ్రీనగర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను అమిత్ షా ప్రారంభిస్తారు.

జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సుడిగాలి పర్యటన కొనసాగుతోంది. జమ్ము లోని సరిహద్దు ప్రాంతమైన కథువాలో పర్యటించారు. వాస్తవాధీన రేఖ దగ్గర బీఎస్‌ఎఫ్‌ పోస్ట్‌లను పరిశీలించారు . బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులతో సరిహద్దు భద్రతపై చర్చించారు. గత కొద్ది రోజులుగా కథువా సరిహద్దు నుంచి చొరబాట్లు పెరిగాయి. అయితే ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి.

బిఎస్ఎఫ్ జవాన్లతో అమిత్‌షా మాట్లాడారు. జవాన్లకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుంందని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో భద్రతను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. దేశాన్ని కాపాడటంలో BSF బలగాలు ముందు వరుసలో ఉన్నాయని కొనియాడారు. జమ్ము కశ్మీర్‌ కథువాలోని వినయ్‌ సరిహద్దులో BSF సిబ్బందితో ఆయన మాట్లాడారు. BSFను బలోపేతం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని అమిత్‌ షా ప్రకటించారు.

జమ్ము పర్యటన ముగించున్న తరువాత అమిత్‌ షా శ్రీనగర్‌ చేరుకున్నారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అమిత్‌షాకు జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఘనస్వాగతం పలికారు. శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన డీఎస్పీ హుమాయున్‌ భట్‌ కుటుంబాన్ని అమిత్‌షా పరామర్శించారు. బుధవారం శ్రీనగర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను అమిత్‌షా ప్రారంభిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..