Congress party: 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో కీలక రోజు.. నేడే పార్టీ అధ్యక్ష ఎన్నిక..

|

Oct 17, 2022 | 6:15 AM

దాదాపు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వసం సిద్ధమైంది. నేడు (సోమవారం) నాయకులు తమ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ ఎన్నికల విభాగం ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు..

Congress party: 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో కీలక రోజు.. నేడే పార్టీ అధ్యక్ష ఎన్నిక..
Congress Pary President Elections
Follow us on

దాదాపు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వసం సిద్ధమైంది. నేడు (సోమవారం) నాయకులు తమ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ ఎన్నికల విభాగం ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌కు మధ్య గట్టి పోటీ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కాగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో భాగంగా కర్నాటకలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓటు ఎలా వేస్తారన్న దానిపై ఏఐసీసీ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జి జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేశ్‌ స్పందించారు.

బళ్లారిలోని భారత్‌ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో రాహుల్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేస్తారని జైరాం రమేశ్‌ తెలిపారు. రాహుల్‌తో యాత్రలో పాల్గొంటున్న మరో 40 మంది నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఇంటే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తాత్కాతిక అధ్యక్షురాలుగా సోనియా గాంధీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా ఆమె అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా.. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సైతం అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.

సోమవారం ఓటింగ్‌ పూర్తయిన తర్వాత ఈ నెల 19వ తేదీని ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేరోజు ఫలితాన్ని వెలువరించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 238 మంది కాంగ్రెస్‌ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కోసం హైదరాబాద్‌ గాంధీభవన్ లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో నిలిచేదెవరనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..