Road Accident: హిమాచల్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమ్లాలోని నార్ఖండ్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి టెంపో బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
కాగా, దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం తదితర కారణాల వల్ల అమాయకులు బలవుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: Hanmakonda Man Arrested: ఢిల్లీ మైనర్ బాలికను హన్మకొండకు రప్పించి అత్యాచారం.. మధురైలో అరెస్టు..!