ఎఫ్ఐఆర్ లేకుండానే పోగొట్టుకున్న డబ్బులు పొందవచ్చు.. కోర్టు సంచలన తీర్పు..

| Edited By: Srikar T

Mar 29, 2024 | 5:33 PM

రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను నివారించేందుకు పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని సైబర్ నేరగాళ్లు బాధితులను నిండా ముంచేసి ఖజానా ఖాళీ చేస్తున్నారు. మోసపోయిన సొమ్మును తిరిగి ఇప్పించుకోలేక సైబర్ బాధితులు నానా అవస్థలు పడుతున్నారు.

ఎఫ్ఐఆర్ లేకుండానే పోగొట్టుకున్న డబ్బులు పొందవచ్చు.. కోర్టు సంచలన తీర్పు..
Himachal Pradesh High Court
Follow us on

రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను నివారించేందుకు పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని సైబర్ నేరగాళ్లు బాధితులను నిండా ముంచేసి ఖజానా ఖాళీ చేస్తున్నారు. మోసపోయిన సొమ్మును తిరిగి ఇప్పించుకోలేక సైబర్ బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. మోసపోయిన సైబర్ బాధితులకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే తమ డబ్బు తిరిగి ఇచ్చేసేలా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బాధితుల నుండి ఫిర్యాదు రాగానే సంబంధిత నేరగాడి ఖాతాలో ఉన్న డబ్బును సైబర్ పోలీసులు ఫ్రీజ్ చేస్తారు. అయితే ఆ డబ్బును తిరిగి బాధితులకు ఇచ్చేందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది.

సాధారణంగా ఒక అకౌంటును ఫ్రీజ్ చేయడానికి సిఆర్‎పిసిలోని 102 సెక్షన్ కింద డబ్బును ఫ్రీజ్ చేస్తారు. అయితే లీగల్ ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత ట్రైల్ కోర్ట్స్లో సిఆర్పిసి 457 సెక్షన్ కింద ఆ డబ్బును కోర్టులు రిలీజ్ చేస్తాయి. అయితే ఈ తతంగం మొత్తం జరగటానికి సమయం పడుతూ ఉండటంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పలువురు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బు మొత్తం సైబర్ నెరగాళ్లు లూటీ చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు వారి అకౌంటులను ఫ్రీజ్ చేస్తున్నప్పటికీ తమకు డబ్బు చేరటంలో చాలా ఆలస్యం అవుతుందంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై జోక్యం చేసుకున్న హిమాచల్ ప్రదేశ్ రిజిస్టర్ ఆర్కే చౌదరి ట్రైల్ కోర్టులకు దిశా నిర్దేశం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు అవసరం లేకుండానే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‎లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు కాపీని ఆధారంగా చేసుకుని బాధితుల డబ్బులు తిరిగి ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సైబర్ క్రైమ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల బారిన పడిన బాధితుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..