కంగనను భగత్ సింగ్ తో పోల్చిన విశాల్

మహారాష్ట్రలో ప్రకంపనలు రేపుతోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు స్టార్ హీరో విశాల్ పూర్తి మద్దతును ప్రకటించాడు. 'డియర్ కంగన... నీ గట్స్ కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కాకపోయినా..

కంగనను భగత్ సింగ్ తో పోల్చిన విశాల్

Updated on: Sep 10, 2020 | 4:40 PM

మహారాష్ట్రలో ప్రకంపనలు రేపుతోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు స్టార్ హీరో విశాల్ పూర్తి మద్దతును ప్రకటించాడు. ‘డియర్ కంగన… నీ గట్స్ కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కాకపోయినా ధైర్యంగా నిలబడి ఒక ప్రభుత్వాన్నిఎదుర్కొంటున్నావ్. 1920లలో భగత్ సింగ్ చేసినట్లే చేస్తున్నావ్. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు తమ గొంతుకను ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చినందుకు వందనాలు’ అంటూ విశాల్ కంగనకు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు ‘వాక్ స్వాతంత్ర్యపు హక్కు (ఆర్టికల్ 19)’ అని పేర్కొన్నాడు. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేలపై కంగనా రనౌత్ వరుస కామెంట్లు చేసి సవాళ్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us