కరోనా పోవాలంటే పిడకల ధూపం వేయండి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి

|

Mar 08, 2021 | 2:20 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం ఇంకా ముగియలేదు. దేశవ్యాప్తంగా కరోనాను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గదర్శకాలు జారీ చేశాయి.

కరోనా పోవాలంటే పిడకల ధూపం వేయండి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి
Follow us on

Havan of cow dung cake : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం ఇంకా ముగియలేదు. దేశవ్యాప్తంగా కరోనాను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గదర్శకాలు జారీ చేశాయి. మరోవైపు కరోనా టీకా పంపిణీ చురుకుగా సాగుతుంది. అయినప్పటికీ రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సాంస్కృతిక మంత్రి ఉషా ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడల ధూపంతో కరోనా దరిచేయంటు కామెంట్ చేశారు.

కోవిడ్-19 నుంచి కాపాడేందుకు వైదిక జీవన విధానాలను అనుసరించాలని ఉషా ఠాకుర్ పేర్కొన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఆవు పేడ పిడకలపై నెయ్యివేసి వెలిగిస్తే వచ్చే పొగతో ఇల్లంతా శానిటైజ్ అవుతుందని, దీని ప్రభావం 12 గంటల వరకూ ఉంటుందని అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండోర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ కోవిడ్-19 విజృంభణను అడ్డుకునేందుకు అలోపతితో పాటు వైదిక దినచర్య పాటించాలన్నారు. ఆవు పాలతో తయారు చేసిన నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేయాలని అన్నారు. తన మాటలు అందరికీ వింతగా అనిపించవచ్చని, కానీ ఈ విధానాలు అనుసరించడం ద్వారా చక్కని ఫలితాలు పొందవచ్చన్నారు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చెప్పారు.

వేద జీవనశైలిని అవలంబించడం ద్వారా కరోనా ప్రభావాన్ని నివారించవచ్చని ఉషా చెప్పారు. ఔషధాలతో పాటు, వేద జీవనశైలిని అవలంబించడం ద్వారా కరోనాను నివారించవచ్చని ఆమె అన్నారు. కరోనా వైరస్ ద్వారా మనం మళ్లీ వేద జీవనశైలికి అలవాటు పడక తప్పదన్నారు.

Read Also ….  మమతా బెనర్జీ తరఫున ప్రచారం చేస్తే రూ. 50 లక్షలు ఇస్తామన్నారు, ఫరూక్ అబ్దుల్లా