Farmers Protest: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న హర్యానా ప్రభుత్వం..

|

Feb 04, 2021 | 5:28 AM

Farmers Protest: రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనపై తప్పుడు..

Farmers Protest: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న హర్యానా ప్రభుత్వం..
Follow us on

Farmers Protest: రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనపై తప్పుడు ప్రచారాలు జరగకుండా ఉండేందుకు గాను మొబైల్ ఇంటర్నెట్ సేవలను మరికొంత సమయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో గల ఐదు జిల్లాల్లో వాయిస్ కాల్స్ మినహా.. మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్, బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్, డాంగెల్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హర్యానాలోని కైతల్, జింద్, రోహ్‌తక్, సోనిపట్, ఝజ్జర్ జిల్లలో ఈ నిషేధాజ్ఞలు గురువారం సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే, ఇప్పటి వరకూ మొబైల్ ఇంటర్నెట్ సేవల నిషేధిత జాబితాలో ఉన్న పానిపట్, ఛక్రీ దద్రి జిల్లాలను తొలగించింది. ఈ రెండు జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 70 రోజులకు పైగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోలనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం, తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు గల హర్యానా రాష్ట్రానికి చెందిన జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.

Also read:

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ గవర్నర్ భర్త.. స్ఫూర్తి నింపారన్న గవర్నర్ తమిళిసై..

రేషన్‌కు ఓటీపీ కష్టాలు, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్న పేదలు, ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఉరుకుపరుగులు