కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా అందరిని వెంటాడుతోంది. ఇప్పటి ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్‌మోర్చా అధినేత జీతన్ రాం మాంఝీకి కరోనా పాజిటివ్ తేలింది. నిన్న తన నివాసంలో హిందుస్థానీ అవామ్ మోర్చా జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కొంత ఆనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని ఆయన ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నిన్న కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.