ఇదేం చిత్రం.. చేసిందీ గలీజ్ పని.. కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై దాడి..!

పనీర్ తినే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుజరాత్‌లో వరుసగా రెండవ రోజు నకిలీ పనీర్ పట్టుబడింది. ఆహార-ఔషధ శాఖ బృందం మహేసాణా జిల్లాలోని విజాపూర్‌లో ఉన్న డివైన్ ఫుడ్ ఫ్యాక్టరీపై దాడి చేసింది. అక్కడ వందల కిలోల నకిలీ పనీర్ స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదేం చిత్రం.. చేసిందీ గలీజ్ పని.. కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై దాడి..!
Fake Paneer

Updated on: Aug 09, 2025 | 1:57 PM

పనీర్ తినే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుజరాత్‌లో వరుసగా రెండవ రోజు నకిలీ పనీర్ పట్టుబడింది. ఆహార-ఔషధ శాఖ బృందం మహేసాణా జిల్లాలోని విజాపూర్‌లో ఉన్న డివైన్ ఫుడ్ ఫ్యాక్టరీపై దాడి చేసింది. అక్కడ వందల కిలోల నకిలీ పనీర్ స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

అయితే నకిలీ పనీర్ తయారీ ఫ్యాక్టరీలో ఆహార శాఖ అధికారులు దాడిని కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా బృందంపై ఫ్యాక్టరీ నిర్వాహకులు దాడి చేశారు. హిమ్మత్‌నగర్ హైవేపై ఉన్న డివైన్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఫుడ్ విభాగం తనిఖీలు చేపట్టగా, నిర్వహకులను మీడియా బృందం వివరణ కోరింది. దీంతో కెమెరామన్‌ను తోసి, బూమ్ మైక్ వైర్లు తెంచాడు. అంతేకాదు దుర్భాషలాడుతూ.. కెమెరామెన్‌పై దాడికి తెగబడ్డారు నిర్వహకులు. ఈ దాడి వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.

పామోలిన్ ఆయిల్‌, ఇండస్ట్రియల్ గ్రేడ్ అసిటిక్ యాసిడ్‌ వాడి కల్తీ పనీర్ తయారు చేసి అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాడిలో రూ. 1,29,800 విలువైన 649 కిలోల పనీర్‌, రూ. 32,130 విలువైన 238 కిలోల పామోలిన్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫ్యాక్టరీని సీజ్ చేసిన మహేసాణా ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..