గవర్నర్ దే ఆ అధికారం.. సుప్రీంకోర్టు ఆదేశం

మధ్యప్రదేశ్ లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల కారణంగా అప్పటి సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కారణంగా గత మార్చి 16 న అసెంబ్లీలో బల నిరూపణ  చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ లాల్ జీ టాండన్ ఇఛ్చిన ఆదేశాలు సబబేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గవర్నర్ దే ఆ అధికారం.. సుప్రీంకోర్టు ఆదేశం

Edited By:

Updated on: Apr 14, 2020 | 5:32 PM

మధ్యప్రదేశ్ లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల కారణంగా అప్పటి సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కారణంగా గత మార్చి 16 న అసెంబ్లీలో బల నిరూపణ  చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ లాల్ జీ టాండన్ ఇఛ్చిన ఆదేశాలు సబబేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి రాజీనామాల పర్యవసానంగా సభలో తన మెజారిటీని నిరూపించుకోలేక కమల్ నాథ్ రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. సభ జరుగుతున్నప్పుడు సైతం ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ముఖ్యమంత్రిని ఆదేశించే అధికారం గవర్నర్ కు ఉంటుందని కోర్టు పేర్కొంది. కానీ అసెంబ్లీ స్పీకర్  ను మించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం గవర్నర్ కు లేదన్న కాంగ్రెస్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్, దుష్యంత్ దవే ల వాదనలను న్యాయమూర్తులు జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో  కూడిన బెంచ్ తోసిపుచ్చింది.

ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఉద్దేశం గవర్నర్ కు ఉండదని, ఫ్లోర్ టెస్ట్ జరపాలని ఆయన నిర్ణయించిన పక్షంలో.. అది జ్యూడిషియల్ రివ్యూకులోబడే ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. గవర్నర్ లాల్ జీ టాండన్ హౌస్ ప్రొసీడింగ్స్ లో జోక్యం చేసుకోలేదని, స్పీకర్ అధికారాలను కైవసం చేసుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా గవర్నర్ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బీజేపీ తరఫు న్యాయవాదులు ముకుల్ రోహ్తగీ, మనీందర్ సింగ్ ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. మధ్యప్రదేశ్ లో .. కమల్ నాథ్ రాజీనామా అనంతరం బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us