Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో భారతీయులు ఎక్కువగా దేనికోసం వెతికారో తెలుసా?

|

Dec 07, 2022 | 9:55 PM

ఈ ఏడాది (2022) గూగుల్‌ సర్చ్‌ ఇంజన్‌లో భారతీయులు ఏం వేతికారో తెలుసా? తాజాగా గూగుల్‌ ఎక్కువ మంది వెదికిన పదాల లిస్టును 'గూగుల్‌ ఇయర్‌ ఇన్‌ సర్చ్‌ 2022 రిజల్ట్స్‌' పేరుతో ప్రకటించింది. ఇంతకీ మనోళ్లు అత్యధికంగా వెతికిన టాప్‌-1 పదం ఏమిటో..

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో భారతీయులు ఎక్కువగా దేనికోసం వెతికారో తెలుసా?
Google Year In Search 2022
Follow us on

ఈ ఏడాది (2022) గూగుల్‌ సర్చ్‌ ఇంజన్‌లో భారతీయులు ఏం వేతికారో తెలుసా? తాజాగా గూగుల్‌ ఎక్కువ మంది వెదికిన పదాల లిస్టును ‘గూగుల్‌ ఇయర్‌ ఇన్‌ సర్చ్‌ 2022 రిజల్ట్స్‌’ పేరుతో ప్రకటించింది. ఇంతకీ మనోళ్లు అత్యధికంగా వెతికిన టాప్‌-1 పదం ఏమిటో తెలుసా? అక్షరాల ‘క్రికెట్‌’. అవును.. ఏడాది ముగింపులో జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ఏషియా కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022.. అనే ఈ మూడు పదాల కోసం తెగ వెతికేశారట. ఇక ఏడాది మొదటి అర్థ భాగంలో భారత ప్రభుత్వం ఆవిష్కరించిన కోవిన్‌ (CoWIN) యాప్‌ కోసం కూడా ప్రత్యేకంగా గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో యూజర్లు అత్యధిక సార్లు పరిశోధించారు.

టాప్‌ 5లో ఫిఫా..

ప్రస్తుతం ఖతర్‌లో జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్‌ కప్‌ (FIFA World Cup)’ పదం టాప్‌ 5 సర్చింగ్‌ లిస్ట్‌లో ఉంది. ఏడాది ముగింపునాటికి టాప్‌-3కి చేరుకునే అవకాశం ఉంది. ఇండియన్స్ గూగుల్‌లో వెదికిన ఇతర ఈవేంట్లలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఐపీఎల్‌ స్పోర్ట్స్‌ కోసం అత్యధికంగా వెదికారు. సినిమాల్లో బ్రాహ్మాస్త్ర, పార్ట్‌ 1-శివ, కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2, e-SHRAM Card కార్డు కోసం ఎక్కువగా వెదికారు.

What is…’ లిస్టులో  వీటిని వెదికారు..

కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది భారత ఆర్మీలో ప్రవేశ పెట్టిన వివాదాస్పద టెంపరరీ రిక్రూట్‌మెంట్‌ విధానమైన ‘అగ్నిపథ్‌ స్కీ (Agneepath Scheme)’ గురించి కూడా వెతికేశారు. ‘What is…’ అనే టైప్‌ చేసిన పదాల్లో నాటో, ఎన్‌ఎఫ్‌టీ, పీఎఫ్‌ఐ, సరోగసీ, సోలార్‌ ఎలిప్స్, ఆర్టికల్ 370 టాప్‌ లిస్టులో ఉన్నాయి.
వీటితోపాటు దగ్గర్లో ఉన్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్, స్విమ్మింగ్‌ ఫూల్‌, వాటర్‌ పార్క్‌, మాల్స్, మువీ థియేటర్‌.. పదాలను వెదికారు.

ఇవి కూడా చదవండి

భారతీయులు వీటిని కూడా గూగుల్‌లోనే వెతికారు?

హౌ టు డౌన్‌లోడ్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్స్‌ (కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను ఏ విధంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి), పీటీఆర్‌సీ చలాన్‌, హౌ టు మేక్‌ e-SHRAM card (ఈ-శ్రమ్‌ కార్డును ఏ విధంగా తయారు చేయాలి), హౌ టు లింక్‌ వోటర్‌ కార్డ్‌ విత్‌ ఆధార్‌ కార్డు (ఆధార్‌తో ఓటర్‌ కార్డును ఏ విధంగా లింక్‌ చేయాలి), హౌ టు అప్లై వార్డ్‌లే (వార్డ్‌లేకు ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి).. వంటి వాటి కోసం ‘గూగుల్ టెల్‌ మీ’ ఎలా వెతకాలి? ఎలా లింక్‌ చేయాలి.. అని విషయాలు తెలుసుకోవడానికి యూజర్లు ఎక్కువగా గూగుల్‌ సహాయం కోరారు.

ప్రముఖ వ్యక్తుల్లో..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే కొత్త ప్రధాని రిషి సునాక్‌, బీజేపీ మాజీ లీడర్‌ నుపూర్‌ శర్మ (వివాదాస్పద వ్యాఖ్యలు), లలిత్‌ మోదీ (సుస్మితాసేన్‌తో రిలేషన్‌షిప్‌), ఏక్‌నాథ్‌ షిండే. అలాగే లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ మృతి, పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూస్ వాలా హత్య, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూపీ ఎన్నికల ఫలితాలు, దేశంలోని కోవిడ్-19 కేసులు.. గూగుల్‌లో వెదికిన న్యూస్‌ ఈవెంట్‌లలో ఇవి టాప్‌లో ఉన్నాయి. ఏడాది మృతి చెందిన వారిలో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ మృతి, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II మృతి, సింగర్‌ బప్పి లహిరి మృతికి సంబంధించి భారతీయులు అధికంగా గూగుల్‌లో వెదికారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.